‘22ఏ’ పై ప్రభుత్వ హామీని జనాలు నమ్ముతారా ?
x

‘22ఏ’ పై ప్రభుత్వ హామీని జనాలు నమ్ముతారా ?


రెవిన్యు చట్టంలో నిషేధిత ఆస్తులకు ఉద్దేశించిన ‘22ఏ’ సెక్షన్ పై ప్రభుత్వం ఎన్ని హామీలు ఇస్తున్నా జనాల్లో నమ్మకం కలగటంలేదు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్, లోకల్ బాడీలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు మాత్రమే ప్రభుత్వం రెవిన్యుచట్టంలో సెక్షన్ 22ఏ అనేది 2006-07లో చేర్చించింది. అయితే కాలక్రమంలో ఈ సెక్షన్ ను అధికారులు దుర్వినియోగం చేశారు. 22ఏ సెక్షన్ పరిధిలోకి ప్రైవేటు ఆస్తులు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులను కూడా చేర్చేశారు. ఇప్పటివరకు సుమారు 93 లక్షల ఆస్తులు 22ఏ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్తులను అమ్ముకోవాలని అనుకున్న యజమానులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్ళినపుడు మాత్రమే తమ ఆస్తులు 22ఏ సెక్షన్లో ఉన్నట్లు తెలుసుకుని మొత్తుకుంటున్నారు. ఇపుడు అంశం రాష్ట్రవ్యాప్తంగా బాగా వివాదాస్పదమైపోయింది.


ఎప్పుడైతే జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోందో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవిన్యుమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేల్కొన్నారు. సమస్య పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ అని ఉన్నతాధికారుల కమిటి అని మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనలను జనాలు నమ్మటంలేదు. ఎందుకంటే తమ ఆస్తులను 22ఏ పరిదిలో నుండి తప్పించాలంటే యజమానులు ఎంఆర్వోలకు దరఖాస్తులు ఇవ్వాలని మంత్రి చెప్పటమే. ఎంఆర్వోలకు దరఖాస్తులు ఇస్తే తమచుట్టూ తిప్పించుకుంటారు కాని పనిచేయరు అన్న అనుమానాలు జనాల్లో పెరిగిపోతోంది.

ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని వెంటనే పరిష్కరిస్తారా? లేక ఇలాగే జాప్యం జరుగుతూ ఉంటుందా అన్నది వేచి చూడాల్సిందే.


Read More
Next Story