ధరణి అక్రమాలపై రేవంత్ చర్యలు తీసుకుంటారా ?
x

ధరణి అక్రమాలపై రేవంత్ చర్యలు తీసుకుంటారా ?

ధరణిపై రేవంత్ రెడ్డి నాలుగో విచారణ


తెలంగాణలో గత బీఆర్‌ఎస్ పాలనలో ధరణి పేరిట జరిగిన జరిగిన భూ కుంభకోణం మీద కాంగ్రెస్ విమర్శలు చేస్తుందే తప్ప దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు పెరిగిపోతూ ఉన్నాయి.2014 నాటికి రాష్ట్రంలో 17.78 లక్షల ఎకరాల సాగుకు పనికిరాని ప్రభుత్వ భూమి ఉంటే, 2024 నాటికి అది 15.46 లక్షల ఎకరాలకు పడిపోయిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే ఏకంగా 2.32 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైపోయింది. ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకుని, ఎన్‌ఓసీలు, నాళా కన్వర్షన్లు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ల పేరిట రాత్రికి రాత్రే రికార్డులు ట్యాంపర్ చేసి, నాటి రాజకీయ నాయకులు, వారి బినామీ కంపెనీలు సర్కారీ భూములను కబ్జా చేశాయని ఫొరెన్సిక్ ఆడిట్, అధికారుల కమిటీల నివేదికల ద్వారా స్పష్టంగా తేలిపోయింది.

అయితే, భూ అక్రమాలు జరిగాయని, నాటి మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉందంటూ మాట్లాడే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎందుకు తాత్సారం చేస్తోంది? ఇప్పటికే ధరణి కమిటీ, ఫొరెన్సిక్ ఆడిట్, బిఎమ్‌ఎల్ అధికారుల కమిటీలు లెక్కలు తేల్చి నివేదికలు ఇచ్చినప్పటికీ, మళ్లీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో కొత్తగా 'సిట్' కమిటీ వేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? గతంలో తేల్చిన అంశాలకు భిన్నంగా ఈ కమిటి ఏం చెప్పగలదు?

దీని గురించి హై కోర్ట్ అడ్వొకేట్ పి.హరిబాబు మాట్లాడుతూ,కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. అక్రమంగా పొందిన ఎన్‌ఓసీలను రద్దు చేసి, ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ సెక్షన్ 166-బీ ప్రకారం ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. 'కమిషన్ ఆఫ్ ఎంక్వొరీస్ యాక్ట్, 1952' ప్రకారం చట్టబద్ధత కలిగిన కమిషన్‌ను ఏర్పాటు చేసి, భూ దోపిడీకి పాల్పడిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే గతంలో 'ధరణి' పేరుతో జరిగిన దోపిడీకి, నేడు 'భూ భారతి' పేరుతో జరుగుతున్న చర్యలకు తేడా ఏమీ లేదని స్పష్టమవుతుందని అన్నారు.



Read More
Next Story