x

గ్రాడ్యుయేట్ పరీక్షలో రేవంత్ పాసవుతాడా ?

రాష్ట్రం మొత్తంమీద 119 నియోజకవర్గాలుంటే ఈ ఆరు జిల్లాల్లోని 77 నియోజకవర్గాల్లోని గ్రాడ్యుయేట్లు ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు


క్షేత్రస్ధాయిలో పరిస్దితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి అయిన రెండున్నరళ్ళ తర్వాత రాష్ట్రంలోని మెజారిటి నియోజకవర్గాల్లో ప్రజల మనోభావాలు బయటపడే అవకాశంగా ఎంఎల్సీ ఎన్నికలను చూస్తున్నారు. వచ్చేఏడాది ఫిబ్రవరి-మార్చిలో రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల స్ధానంతో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల నియోజకవర్గం రెండోది.

రాష్ట్రం మొత్తంమీద 119 నియోజకవర్గాలుంటే ఈ ఆరు జిల్లాల్లోని 77 నియోజకవర్గాల్లోని గ్రాడ్యుయేట్లు ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. పైగా రాజధాని హైదరాబాద్, జిల్లా కేంద్రాల్లోని అర్బన్ ప్రాంత ఓటర్లతో పాటు ఆరు జిల్లాల్లోని రూరల్ ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లు తమ తీర్పు ఇవ్వబోతున్నారు. హైదరాబాద్ స్ధానం పరిధిలోకి వచ్చే మూడుజిల్లాల్లో 44 నియోజకవర్గాలు కవర్ అవుతాయి.

నల్గొండ స్ధానం పరిధిలోని మూడుజిల్లాల్లో 33 నియోజకవర్గాలుంటాయి. అర్బన్+రూరల్ నియోజకవర్గాల్లోని గ్రాడ్యుయేట్లు వేయబోయే ఓట్లు రేవంత్ ప్రభుత్వం పనితీరుపై ప్రజల తీర్పుకు కొలమానంగా భావిస్తున్నారు. హైదరాబాద్ స్ధానంలో పోయిన ఎన్నికల్లో 5.10 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓట్లేయగా నల్గొండ స్ధానంలో 5 లక్షల మంది ఓట్లేశారు. ఇపుడు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు జరుగుతున్నది. నవంబర్ 5వ తేదీతో ఓటర్ నమోదు కార్యక్రమం ముగిసిన తర్వాత 20వ తేదీన ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది.

నిజానికి 10 లక్షల ఓటర్ల తీర్పు మొత్తం రాష్ట్రంలోని ప్రజల తీర్పును ప్రతిఫలించదు. అయితే ఈ తీర్పు జనాల ఆలోచనలను శాంపుల్ గా పరిగణించవచ్చు. అందుకనే ఈ రెండు సీట్లలో గెలిచితీరాలని రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నారు.

Read More
Next Story