x

కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎంపిక

ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ స్ధానాలకు కాంగ్రెస్ పార్టీ సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిని అభ్యర్ధులుగా ప్రకటించింది.


ఇద్దరు ఎంఎల్సీ అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ స్ధానాలకు కాంగ్రెస్ పార్టీ సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిని అభ్యర్ధులుగా ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సామా, నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గానికి రాంరెడ్డి పోటీ చేయబోతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పాన్సర్ చేసిన ఈ యుద్దరు యువకులు కావటం గమనార్హం. ఇద్దరి వయసు కూడా 30ల్లోనే ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఎన్నిక కాబట్టి యువకులనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా ఎంపికచేసింది. ఈ ఇద్దరు కూడా కొంతకాలంగా యూనివర్సిటీ విద్యార్ధులు, యువజన సంఘాల్లోని సభ్యులతో భేటీలవుతున్నారు.

పార్టీలోని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ముఖ్యుల మద్దతుతో పాటు ఎన్నికల్లో ఓటర్లుగా డిగ్రీ హోల్డర్లే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ తన అభ్యర్ధులుగా యువతను ఎంపికచేసినట్లు అర్ధమవుతోంది. గడచిన ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో 5.15 లక్షల ఓట్లుండగా నల్గొండ నియోజకవర్గంలో 5 లక్షల ఓట్లున్నాయి.

ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్ని ఓట్లుంటాయో చూడాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ప్రకటన నేపధ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరిని అభ్యర్ధులుగా ప్రకటిస్తాయనే ఆసక్తి పెరుగుతోంది. జనసేన తరపున నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ గడల శ్రీనివాస్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

Read More
Next Story