గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తుకి కాంగ్రెస్ డిమాండ్..
x

గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తుకి కాంగ్రెస్ డిమాండ్..

సంతాపాన్ని వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ..


Click the Play button to hear this message in audio format

గోవా(Goa) నైట్‌క్లబ్‌లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ (Congress) నాయకులు రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే(Kharge) డిమాండ్ చేశారు. ఉత్తర గోవా అర్పోరా గ్రామంలోని నైట్‌క్లబ్ ‘‘బిర్చ్ బై రోమియో లేన్‌’’లో ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో సిలిండర్ పేలడంతో జరిగిన అగ్ని ప్రమాదం(Fire Accident)లో 25 మంది చనిపోగా, మరో ఆరుగురు గాయపడ్డ విషయం తెలిసిందే. అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వీలైతే ఆర్థిక సాయం చేయాలని కోరారు.

‘పాలనా వైఫల్యం..’

నైట్‌క్లబ్‌లో జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

"మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం ప్రమాదం కాదు. పాలనా వైఫల్యం కూడా. సమగ్రంగా దర్యాప్తు చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’ అని రాహుల్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

Read More
Next Story