
బీజేపీ నాయకుడి హత్య కేసులో దోషిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే
నేడు శిక్ష ఖరాారు చేయనున్న ప్రత్యేక న్యాయస్థానం
2016లో జరిగిన బీజేపీ నాయకుడు యోగేష్ గౌడ హత్య కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం దోషిగా నిర్ధారించింది. ఆయనతో పాటు మరో 18 మంది దోషులుగా న్యాయస్థానం తేల్చింది. మరో ఇద్దరు నిందితులను నిర్ధోషులుగా న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ విడుదల చేశారు. ఈ నిందితులకు గురువారం న్యాయమూర్తి శిక్ష ఖరారు చేయనున్నారు.
బీజేపీ సభ్యుడు, ధార్వాడ్ జిల్లా పంచాయత్ మాజీ సభ్యుడైన యోగేష్ గౌడను 2016 జూన్ 15న ధార్వాడ్‌లోని ఆయన జిమ్ లో దారుణంగా నరికి చంపారు. ఈ హత్యలో కుట్ర పన్నారనే ఆరోపణలు కులకర్ణిపై ఉన్నాయి.
ఘటన జరిగిన సమయంలో ఆయన మంత్రిగా ఉన్నారు. మొదట స్థానిక పోలీసులు విచారించిన ఈ కేసు, 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీబీఐకి బదిలీ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ 113 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి, 2020లో కులకర్ణిని అరెస్టు చేసింది. ఆయన దాదాపు తొమ్మిది నెలలుగా జైలులో ఉన్నాడు. తరువాత ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐని, నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
Next Story

