పుచ్చకాయ వల్ల మరణించలేదా? ఇంకేం జరిగి ఉంటుంది?
x

పుచ్చకాయ వల్ల మరణించలేదా? ఇంకేం జరిగి ఉంటుంది?

బాధితుల శరీరాల్లో మార్ఫిన్ ఆనవాళ్లు, విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసుల విచారణ


Click the Play button to hear this message in audio format

వారం క్రితం ముంబైలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుచ్చకాయ కలుషితం కాలేదని వారిపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొబైల్ యాక్సెసరీస్ వ్యాపారి అయిన అబ్దుల్లా డోకాడియా (45), అతని భార్య నస్రీన్ (35), వారి కుమార్తెలు జైనాబ్ (13), అయేషా (16) శనివారం (ఏప్రిల్ 25) తమ ఐదుగురు బంధువులకు విందు ఇచ్చి, వారికి మటన్ పులావ్ వడ్డించారు.
కానీ కొన్ని గంటల తర్వాత సుమారు అర్థరాత్రి ఒంటి గంటకు, ఆ కుటుంబం పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5 గంటలకల్లా, నలుగురిలోనూ వాంతులు, విరేచనాలతో సహా తీవ్రమైన లక్షణాలు కనిపించి, కొన్ని గంటల్లోనే మరణించారు.

ఫోరెన్సిక్ నివేదికలు...

మరణాలకు పుచ్చకాయతో సంబంధం ఉందని వచ్చిన ప్రాథమిక నివేదికలు ఆహార భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. కొన్ని ప్రాంతాల్లో పుచ్చకాయ అమ్మకాలు కూడా తగ్గినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఫోరెన్సిక్ నివేదికలు సంక్లిష్టమైన ఆందోళనకరమైన కారణాన్ని సూచిస్తున్నాయి.
ఎన్‌డిటివి నివేదిక ప్రకారం, బాధితుల మెదడు, గుండె, పేగులు వంటి కీలక అవయవాలు ఆకుపచ్చగా మారాయని తేలింది. ఇది అసాధారణమైన విషయమని, సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కేసులతో ఇది సరిపోలడం లేదని వైద్యులు అంటున్నారు.
ఈ కేసును పరిశీలిస్తున్న వైద్య నిపుణులు, ఈ సంకేతాలు విష ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

మార్ఫిన్ ఆనవాళ్లు

నొప్పి నివారణకు వాడే మార్పిన్ ఆనవాళ్లు బాధితుల శరీరాల్లో కనిపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఏదైన వైద్యుల సలహ మేరకు వీటిని తీసుకున్నారా లేకు ప్రమాదవశాత్తూ తీసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి, విందుకు హాజరైన అతిథుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు. వారందరూ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనకు ముందు కుటుంబం ఏదైనా ఒత్తిడికి గురైందా అని కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మరణాలకు, పుచ్చకాయకు మధ్య ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఏర్పడలేదని రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన సంస్థ (ఎఫ్‌డీఏ) స్పష్టం చేసింది. ఆ పండు విషపూరిత పదార్థంతో కలుషితమైందా లేదా కల్తీ చేయబడిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, శవపరీక్షలు నిర్వహించిన వైద్యులు తమ తుది అభిప్రాయాన్ని వెల్లడించలేదు. మృతుల అంతర్గత అవయవాల నమూనాలను వివరణాత్మక రసాయన విశ్లేషణ కోసం పంపారు. తుది ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాతే కచ్చితమైన నిర్ధారణలకు వస్తామని అధికారులు చెప్పారు.
Read More
Next Story