
ఎన్నికల ఫలితాలతో బోసిపోయిన డీఎంకే కార్యాలయం..
ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో టెంట్లు తొలగింపు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో టీవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాక అధికారంలో ఉన్న డీఎంకే.. వరుసగా రెండో సారి అధికారంలోకి వస్తామని భావించింది. ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ కూడా దానికే అనుకూలంగా అంచనాలు వెలువరించాయి.
అయితే తుది ఫలితాలు మాత్రం ఎవరికి అందకుండా వస్తున్నాయి. దీనితో డీఎంకే ప్రధాన పార్టీ కార్యాలయమైన ‘అన్నా అరివాలయం’ బోసిపోయింది. ఆ పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీవీకే కంచుకోటలైన పనైయూర్, నీలన్‌కరైలలో పూర్తిగా భిన్నమైన దృశ్యం ఆవిష్కృతమవుతోంది. నీలన్‌కరైలోని నటుడు-రాజకీయవేత్త విజయ్ నివాసం, పనైయూర్‌లోని టీవీకే పార్టీ కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, తొలిసారిగా బరిలోకి దిగిన ఈ పార్టీ 97 నియోజకవర్గాల్లో ఆధిక్యంతో బలమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఏఐఏడీఎంకేతో హోరాహోరీ పోరులో నిలుస్తుండటంతో వందలాది మంది ఉత్సాహభరిత మద్దతుదారులు గుమికూడటం ప్రారంభించారు.
ప్రస్తుత గణాంకాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో పెను మార్పును సూచిస్తున్నాయి. పలువురు డీఎంకే అగ్ర నాయకులు తమతమ నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62 కౌంటింగ్ కేంద్రాల నుంచి ఫలితాలు వెలువడుతున్న కొద్దీ, శాంతిభద్రతలను కాపాడటానికి రాజధాని అంతటా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు.
Next Story

