
ప్రైవేట్ బస్సుల నేషనల్ పర్మిట్ బంద్?
ప్రైవేట్ బస్సుల పర్మిట్ రాష్ట్రాలకే ఇవ్వాలని చంద్రబాబు రాసిన లేఖకు స్పందించిన కేంద్రం
దేశంలో ప్రయివేటు బస్సుల నేషనల్ పర్మిట్ జారీ చేసే అధికారం రాష్ట్రాల చేతికే దక్కనుంది. కర్నూలు నగరానికి శివారులోని చిన్నటేకూరు వద్ద ప్రయివేటు ఓల్వో బస్సు దగ్ధమైన ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ప్రయివేటు బస్సుల పర్మిట్ రాష్ట్రాలకే ఉండాలని కేంద్రానికి రాసిన లేఖకు సానుకూల స్పందన వచ్చింది.
'వన్ ఇండియా - వన్ టాక్స్- 2021 విధానంలో వెసులుబాటును ప్రయివేటు స్లీపర్, ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు సొమ్ము చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్, సీటుకు వసూలు చేసే పన్నులు అధికంగా ఉన్నాయంటూ ఈశాన్యం రాష్ట్రాల వైపు మళ్లారు. దీనివల్ల రాష్ట్రాలకు రావాణాశాఖ నుంచి రావాల్సిన ఆదాయానికి గండి పడింది. తాజాగా ఈ విధానం రద్దు చేయడం ద్వారా ప్రయివేటు బస్సుల రిజిస్ట్రేషన్లు హోం స్టేట్ లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పాత పద్దతి అమలులోకి తెచ్చింది. ఇకపై ప్రైవేటు బస్సులు తప్పనిసరిగా ఏపీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
కదలించిన ఘటన
2025 అక్టోబర్ 24వ తేదీ కర్నూలు నగరం చిన్నటేకూరుపేట వద్ద వి.కావేరీ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైన విషాద ఘటనలో 21 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనతో దేశం మొత్తం చలించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించింది.
2025 నవంబర్ ఒకతో తేదీ శ్రీసత్యసాయి జిల్లా తలపుల మండలం పెద్దన్నవారిపల్లెలో జరిగిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ, కర్నూలు విషాద సంఘటనపై స్పందించారు.
"రాష్ట్రంలో ప్రయివేటు రవాణ వ్యవస్థను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఇండియా వన్ టాక్స్ విధానం మంచిదే. ఇందులో జాతీయ పన్ను విధానం నుంచి రవాణా వ్యవస్థను తప్పించమని లేఖ రాస్తా" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఆయన రాసిన లేఖకు స్పందించిన కేంద్రం, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో అటు ప్రయాణికులకు భద్రత, ఇటు రాష్ట్ర ఖజానాకు మూడు నెలలకు రూ. 200 కోట్లకు పైగానే ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
(సమగ్ర కథనం దిఫెడరల్ ఆంధ్రప్రదేశ్ లో చదవండి)
Next Story

