కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
x

కల్తీ మద్యం తాగి 19 మంది మృతి

నాగాలాండ్ లో దారుణం, సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వూలు


Click the Play button to hear this message in audio format

నాగాలాండ్ లో కల్తీ మద్యం సేవించడంతో కనీసం 19 మంది మరణించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.1990 నుంచి నాగాలాండ్ లో మద్యపాన నిషేధ చట్టం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరా గొలుసును గుర్తించేందుకు పోలీసులు ఒక బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

గత రెండు రోజుల్లో అనుమానిత మద్యం సేవించడం వల్ల మోకోక్ చుంగ్ జిల్లాలో ఎనిమిదిమంది, టుయెన్ సాంగ్ జిల్లాలో 11 మంది మరణించినట్లు తెలిసింది. మరణాలపై దర్యాప్తు చేయడానికి, కల్తీ మద్యం అని అనుమానిస్తున్న దాని మూలం, సరఫరా గొలుసును గుర్తించడానికి అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బుంగ్లాంగ్ చాంగ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెసుప్రా శనివారం తెలిపారు.
మరణించడానికి కారణాలు తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ పరీక్ష కోసం నమూనాలను గౌహతికి పంపినట్లు ఆయన తెలిపారు. మాకు కొన్ని ఆధారాలు లభించాయి. కానీ వివరాలను వెల్లడించడం ఇప్పుడే తొందరపాటు అవుతుందని పోలీసులు అన్నారు.
మరణాల అనంతరం పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించి 19 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరి నుంచి దాదాపు మూడు వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
గుర్తు తెలియని, లేబుల్ లేని లేదా అక్రమంగా తయారు చేసినట్లు అనుమానిస్తున్న మద్యం సేవించివద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. అలాగే మద్యం సేవించిన తరువాత తల తిరగడం, దృష్టి మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.
Read More
Next Story