జార్ఖండ్: త్రివర్ణ యాత్ర చేపట్టిన విద్యార్థులు..
x

జార్ఖండ్: త్రివర్ణ యాత్ర చేపట్టిన విద్యార్థులు..

దేశానికి యవత గళమే బలమని నినాదాలు


Click the Play button to hear this message in audio format

భారత్ లో 80 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్ఖండ్ పరీక్ష అవకతవకలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన నిరసనలో 22వ రోజున వేలాది మంది ఉద్యోగార్థులు రాంఛీలో త్రివర్ణ యాత్ర చేపట్టారు. త్రివర్ణ పతాకాలను చేతపట్టుకుని, దేశభక్తి నినాదాలు చేస్తూ తక్షణ నియామక సంస్కరణలను డిమాండ్ చేస్తూ ప్రదర్శనకారులు జైపాల్ సింగ్ మొండా స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకూ కవాతు నిర్వహించారు. వేలాదిమంది ఉద్యోగార్థులు ప్రజలు చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

14 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా నాయకుడు దేవేంద్ర మహాతా పాదయాత్రలో పాల్గొనేందుకు సదర్ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు పోలీసులు తమను అనుమతించలేదని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం అంటే కేవలం బ్రిటిష్ వారి నుంచి విముక్తి మాత్రమే కాదు. అవకాశాల అసమానతలు, అవినీతి అన్యాయం నుంచి కూడా స్వేచ్ఛ, దేశ యువత చదువుకోవాలి. కష్టపడాలి.. తమ హక్కుల కోసం గళం విప్పాలి. ఇదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం అని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ భవిష్యత్ కోసం శాంతియుతంగా పోరాడుతున్న యువత అందరికి వందనం. యువత గళమే.. భారత భవిష్యత్తు.. జై హింద్.. అని జేపీఎస్పీ- జేఎస్ఎస్పీ సంస్కరణల మంచ్ పేర్కొంది.
Read More
Next Story