’’బలవంతగా సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ డ్యామ్ నిర్మించబోము‘‘
x
పెమా ఖండూ

’’బలవంతగా సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ డ్యామ్ నిర్మించబోము‘‘

అరుచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ


Click the Play button to hear this message in audio format

అరుణాచల్ ప్రదేశ్ లో ప్రతిపాదిత 11,200 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టిపర్పస్ ప్రాజెక్ట్ ను స్థానికులపై బలవంతంగా రుద్దబోమని కేవలం ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ను పూర్తి చేయడానికి మాత్రమే ప్రభుత్వం ప్రస్తుతం సహకారం కోరుతోందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ అన్నారు. ప్రతిపాదిత డ్యామ్ కు వ్యతిరేకంగా ఆదివాసీ సమాజంలోని కొన్నివర్గాలు నిరసన చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థలతో చర్చలు..

ఇటీవల ఉద్యమాలు చేస్తున్న ఆది బానే కెబాంగ్ యువజన విభాగం, ఆది విద్యార్థి సంఘం ప్రతినిధులను కలవాలనుకుంటున్నట్లు సీఎం తెలిపారు. స్థానిక సంస్థలకు ఈ ప్రతిపాదనను నేరుగా వివరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ‘‘ఈ ప్రాజెక్ట్ గురించి మరింత స్పష్టత ఇచ్చేందుకు సియాంగ్ ప్రాంతంలోని అన్ని సంఘాలు, విభాగాలను సంప్రదించాలనుకుంటున్నాను’’ అని ఆయన విలేకరులతో అన్నారు.
‘‘ప్రస్తుతం మేము ఆనకట్ట నిర్మాణం గురించి అసలు మాట్లాడటం లేదు. ప్రస్తుతానికి కేవలం పీఎఫ్ఆర్ మాత్రమే జరగాలి’’ అని ఆయన అన్నట్లు ఏఎన్ఐ పేర్కొంది.
ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలను నివేదిక నిర్ధారించిన తరువాతే ముందుకు వెళ్లాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం అన్నారు. నివేదికలోని అంశాలు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ చట్టం ప్రకారం స్థానికంగా నివాసం ఉండే వారిని సంప్రదిస్తామని ఆయన తెలిపారు.
‘‘ప్రజలతో మాట్లాడకుండా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగకూడదు’’ అని ఖండు అన్నారు. పీఎఫ్ఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ సియాంగ్ ప్రాంతాన్ని సందర్శించడం కొనసాగించడానికి స్థానిక సంస్థలతో ఇటీవల జరిగిన సమావేశాలు తనను ప్రొత్సహించాయని ఆయన తెలిపారు.

ఆదివాసీల ఆందోళన..

ఈ ప్రతిపాదన గురించి తప్పుడు సమాచారం నివాసితులకు ముఖ్యంగా సియాంగ్, అప్పర్ సియాంగ్ జిల్లాల్లో చేరిందని ఖండు అన్నారు. సియాంగ్ నదిపై 11,200 మెగావాట్ల ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఎన్ హెచ్ పీసీ ద్వారా చేపడుతోందని విద్యుత్ ఉత్పత్తిని నీటి నిర్వహణ, వ్యూహాత్మక లక్ష్యాలను అనుసంధానించడమే దీని ఉద్దేశం.
గ్రామాలు మునిగిపోతాయని, ప్రజలు తమ ఇళ్లను, పూర్వీకుల భూములను వదిలి వెళ్లవలసి వస్తుందని ఆది సమాజంలోని కొన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. జీవనోపాధి, పర్యావరణ నష్టం, భూకంపాలు తరుచుగా సంభవించే ప్రాంతంలో ఆనకట్ట భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.

తీవ్రమైన నిరసనలు..

సియాంగ్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిరసనలు తీవ్రం అయ్యాయి. అక్టోబర్ 23న నిరసనకారులు పాసిఘాట్ లోని ఎన్హెచ్పీసీ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. రాజకీయ నాయకులకు సంబంధించిన వాహనాలు, ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ అశాంతి కారణంగా అదనపు భద్రతా బలగాలను మోహరించాల్సి వచ్చింది.
పీఎఫ్ఆర్ పర్యావరణ సమస్యలు, జాతీయ భద్రత పై చర్చించేందుకు ఖండూ అక్టోబర్ 25న శాసన సభ్యులను గిరిజన సమాజ ప్రతినిధులను విడివిడిగా కలిశారు. నాలుగు రోజుల తరువాత ఇటానగర్ లో జరిగిన సంఘీభావ ర్యాలీలో నిర్బంధంలో ఉన్న నిరసనకారులను విడుదల చేయాలని, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి, వ్యతిరేక వర్గాలకు మధ్య చర్చలకు వీలు కల్పించేందుకు అరుణాచల్ ఆదివాసీ గిరిజన ఫోరం ఒక శాంతి కమిటీని ప్రతిపాదించింది. తమ ఆందోళనలను పరిష్కరించే వరకు సంప్రదింపులు జరపాలని, సర్వే పనులను నిలిపివేయాలని స్థానిక సంస్థలు కూడా డిమాండ్ చేశాయి.


Read More
Next Story