
మమతా బెనర్జీ
మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు
పదవిలో ఉండగా రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని న్యాయవాదీ ఫిర్యాదు
మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆవిడ చేసిన వ్యాఖ్యలపై ఓ న్యాయవాదీ ఫిర్యాదు చేశారని సిలిగురి పోలీసులు వెల్లడించారు.
మే 20న సిలిగురి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది రింకీ చటోపాధ్యాయ్ సింగ్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. మొదట పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని, అయితే చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుందనే న్యాయవాదీ వాదనతో కేసు తీసుకున్నారని తెలిసింది.
ఫిర్యాదుదారు ప్రకారం, బెనర్జీ చేసిన రెండు వ్యాఖ్యలు - ఒకటి 2025లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో, మరొకటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధర్మతలా నిరసనలో చేశారు. "భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది సనాతన హిందువుల" మనోభావాలను, నమ్మకాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమైనవని, రెచ్చగొట్టే స్వభావం కలవని కూడా న్యాయవాది ఆరోపించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "ఒక నిర్దిష్ట వర్గం కోరుకుంటే ఐదు నిమిషాల్లో ఇతరులను 'చంపేయగలదని' బెనర్జీ పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు ఆశించలేము" అని ఫిర్యాదుదారు అన్నారు.
సెక్షన్లు 351 (నేరపూరిత బెదిరింపు), 352 (శాంతి భంగానికి ప్రేరేపించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 353 (తప్పుడు ప్రకటనలను ప్రచారం చేయడం), 354 (దైవ ఆగ్రహాన్ని కలిగించి బెదిరించడం), 356 (నేరపూరిత పరువు నష్టం) మరియు 299 (మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా మరియు దురుద్దేశపూర్వకంగా చేసే చర్యలు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు సిలిగురి పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఒక సీనియర్ పోలీస్ అధికారి ధృవీకరించారు. "మాకు ఫిర్యాదు అందింది. ప్రక్రియ ప్రకారం కేసు నమోదు చేయబడింది. ఈ విషయం దర్యాప్తులో ఉంది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నాము" అని ఆ అధికారి పీటీఐకి తెలిపారు.
Next Story

