జైపూర్ లో ఇంటర్నెట్ నిలిపివేసిన బీజేపీ సర్కార్
x
జైపూర్ లో మోహరించిన ప్రత్యేక బలగాలు

జైపూర్ లో ఇంటర్నెట్ నిలిపివేసిన బీజేపీ సర్కార్

రోడ్డు ఆక్రమణల తొలగింపు మసీదు, దేవాలయాల కూల్చివేత


Click the Play button to hear this message in audio format

రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని పలు ప్రాంతాలలో బీజేపీ సర్కార్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఒక రహదారి వెంబడి ఉన్న ఆక్రమణలు తొలగింపు డ్రైవ్ చేస్తోంది. ఇందులో భాగంగా అక్రమంగా నిర్మించిన ఓ మసీద్, రెండు దేవాలయాలను సైతం కూల్చివేయడానికి సమాయత్తం అయింది. రైల్వే లైన్‌కు సమాంతరంగా ఉన్న రహదారిని 80 అడుగులకు విస్తరించే లక్ష్యంతో జగత్‌పురలోని నందపురి అండర్‌పాస్‌లో జరుగుతున్న ఈ డ్రైవ్ సందర్భంగా శాంతిభద్రతలను కాపాడటానికి సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.

జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (జేడీఏ) చేపట్టిన ఈ చర్యలో భాగంగా ఒక మసీదు, రెండు దేవాలయాలు, ఒక సత్సంగ్ భవనం, ఒక మజార్‌ను కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆ రహదారిపై ఉన్న 134 ఆక్రమణలను తొలగించారు. ఆ తర్వాత మతపరమైన కట్టడాల వ్యవహారాలను నిర్వహించే వారికి, ఇతర భాగస్వాములకు నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయడానికి జేడీఏ గడువు ఇచ్చింది.
ఆ గడువు ముగియడంతో, జేడీఏ ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. ఒక అధికారిక ఉత్తర్వు ప్రకారం, జైపూర్ నార్త్, జైపూర్ ఈస్ట్ పోలీస్ జిల్లాల వ్యాప్తంగా జూన్ 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి జూన్ 9వ తేదీ అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలతో పాటు బల్క్ SMS, MMS సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నిలిపివేశారు.
వాయిస్ కాల్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, పుకార్ల వ్యాప్తిని నిరోధించడానికి, ప్రజాశాంతిని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డివిజనల్ కమిషనర్ వి. శరవణ్ కుమార్ తెలిపారు.
ఈ ఆపరేషన్ సమయంలో సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మత విద్వేషాలను, రెచ్చగొట్టే కంటెంట్‌ను లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జైపూర్ పోలీస్ కమిషనర్ సచిన్ మిట్టల్ హెచ్చరించారు.
అధికారులు ఆ ప్రాంతంలోని కొన్ని భాగాలలో రాకపోకలను కూడా నియంత్రించారు. డ్రోన్ నిఘా ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా సమీప ప్రాంతంలో విద్యుత్ సరఫరాను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Read More
Next Story