
ఢిల్లీ: పది లక్షల వాహానాలపై కత్తి వేలాడుతుందా?
నవంబర్ 1 నుంచి కఠినమైన ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం
ఐశ్వర్య రాధాక్రిష్టన్
శీతకాలం అంటేనే ఢిల్లీ గజగజ వణుకుతుంది. చలితో పాటు.. వాయు కాలుష్యం వల్ల దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్ ల మారుతుంది. దీనితో ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకూ కఠినమైన వాహాన ఆంక్షలను విధించాలని ప్రయత్నిస్తోంది.
ఢిల్లీ రవాణా శాఖ అంచనాల ప్రకారం... ప్రతిరోజు ఢిల్లీలోకి ప్రవేశించి బయటకు వెళ్లే కనీసం పది లక్షల వాహానాలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం కానున్నాయి. బీఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహానాలను ఈ ఆంక్షలు లక్ష్యంగా చేసుకుంటాయి. శీతాకాలంలో గాలి నాణ్యత క్షీణించడంతో వాహన ఉద్గారాలను తగ్గించడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం.
దసరా నుంచి ఢిల్లీ గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) పెరుగుతుండగా తీవ్రమవుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద మొదటి దశ చర్యలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి.
చలికాలం..
నవంబర్ 1 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గడం, వాయు కాలుష్యం స్థాయిలూ సాధారణంగా పెరగడం వల్ల ఆంక్షలను క్రమంగా కఠినతరం చేసే అవకాశం ఉంది. నివేదికలో ఉదహరించిన అధ్యయనాల ప్రకారం.. జాతీయ రాజధాని ప్రాంతంలో మొత్తం వాయు కాలుష్యానికి వాహాన ఉద్గారాలు దాదాపు 40 శాతం కారణమవుతున్నాయి. ఈ ఆంక్షల వల్ల నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ వంటి ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చేవారిపై ప్రభావం పడుతుంది.
ఢిల్లీ రవాణా శాఖ అంచనాల ప్రకారం.. ప్రతిరోజు జాతీయ రాజధానిలోకి ప్రవేశించి బయటకు వెళ్లే కనీసం పది లక్షల వాహనాలు నేరుగా ప్రభావితం కావచ్చు. ఆంక్షలను అమలు చేయడానికి అధికారులు పొరుగు నగరాలతో ఉన్న ఢిల్లీ సరిహద్దుల వద్ద తనిఖీలను ముమ్మరం చేసే అవకాశం ఉంది.
సరిహద్దులో తనిఖీలు..
వాహనాల కదలికలను పర్యవేక్షించడానికి, మూడు నెలల పాటు రాజధానిలోకి ప్రవేశించడానికి అనుమతి లేని వాహనాల గురించి పోలీసులను అప్రమత్తం చేయడానికి ఢిల్లీ సరిహద్దులో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వాహనాలను కూడా తనిఖీ చేస్తారు. అంబులెన్స్ లు, ఫైర్ టెండర్ల వంటి అత్యవసర సేవల కోసం ఉపయోగించే వాహనాలతో పాటు ఇతర మినహాయింపు వర్గాల కిందకు వచ్చే వాహనాలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
ఢిల్లీలోకి ప్రవేశించే నిబంధనలకు విరుద్దమైన వాహనాల గుర్తించడం, రహదారులపై అనుమతించబడిన వాహనాలు వర్తించే ఉద్గార, కాలుష్య నియంత్రణ అవసరాలను తీరుస్తున్నాయని నిర్దారించడం ఈ అమలు చర్యల ఉద్దేశ్యం.
ఎవరూ ప్రభావితం...
నివేదికలో వివరించిన ఆంక్షల ప్రకారం.. బీఎస్ 3, బీఎస్ 4 కేటగిరీల కిందకు వచ్చే పెట్రోల్, డీజిల్ వాహనాలు, అలాగే ఢిల్లీ వెలువల రిజిస్టర్ చేయబడిన వాహానాలను జాతీయ రాజధానిలో ప్రవేశించడానికి అనుమతించరు.
ఈవీ వాహానాలు, సంపీడన సహజవాయువు వాహనాలపై పెద్దగా ప్రభావం ఉండదు. అయితే ఢిల్లీ రూడ్లపై తిరగడానికి అనుమతించబడిన అన్ని వాహానాలకు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
పీయూసీ...
ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే ఇంధనం లేదు.. అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దీని ప్రకారం.. ఇంధనం కొనుగోలు చేయడానికి వాహాన యజమానులకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి. రోజువారీ ప్రయాణీకులు పొరుగున ఉన్న ఎన్సీఆర్ నగరాల నుంచి వచ్చే వాహానాలపై ఆంక్షలు ప్రభావం చూపే అవకాశం ఉంది. కావున శీతకాలపు కాలుష్య నియంత్రణ డ్రైవ్ లో ఢిల్లీ సరిహద్దులు, ఇంధన కేంద్రాల వద్ద అమలు కీలకం కానుంది.
Next Story

