
ఎస్పీ- కాంగ్రెస్ మధ్య సీట్ల పొత్తు కుదరటం లేదా?
రాయ్ బరేలీ నుంచి అఖిలేష్ బస్సు యాత్ర ప్రారంభానికి అర్థమేమిటీ?
వచ్చే ఏడాది దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ ప్రజల వద్దకు వెళ్లడానికి సిద్దమైంది.
ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ఎన్నికల వ్యూహామైన ‘పిచ్ డా’ వర్గాలను కలవడానికి రథయాత్రకు సిద్ధమయ్యారు. ఈ యాత్ర ప్రారంభంగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్ బరేలీని ఎంచుకున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలో ఉండాలంటే పొత్తు అవసరమని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఎస్పీ, కాంగ్రెస్ మధ్య జరగాల్సిన సీట్ల పంపకం వాయిదా పడింది.
అవసరమైతే యూపీలోని 403 స్థానాలలో ఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని కూడా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు తమ బలానికి మించి ఎక్కువ స్థాయిలో సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఎస్పీ నాయకులు చెబుతున్న మాట.
వాస్తవానికి అక్టోబర్ ప్రారంభంలో జరగాల్సిన పీడీఏ రథయాత్రను సెప్టెంబర్ 24కి ముందుకు జరిపారు. అయితే, రాయ్‌బరేలీని ఎంచుకోవడమే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నియోజకవర్గానికి లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కనౌజ్ కేంద్రంగా అఖిలేష్ యాదవ్‌కు దీర్ఘకాలంగా రాజకీయాలు నడుపుతున్నారు.
రాయ్‌బరేలీనే ఎందుకు?
రాజకీయ విశ్లేషకుడు శరత్ ప్రధాన్ మాట్లాడుతూ, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌కు ఒక సంకేతంగా చూడవచ్చని, పొత్తును ఖరారు చేయడంలో జాప్యానికి దీనికి సంబంధం ఉండవచ్చని అన్నారు.
ది ఫెడరల్ నిర్వహించిన క్యాపిటల్ బీట్' కార్యక్రమంలో ప్రధాన్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీకి ఉన్న సంస్థాగత బలాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీతో ఒంటరిగా పోరాడే స్థితిలో ఎస్పీ గానీ, కాంగ్రెస్ గానీ లేవని, అలాగే ఏ విస్తృత ప్రతిపక్ష కూటమిలోనైనా కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎస్పీ ఒంటరిగా ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని అఖిలేష్ యాదవ్ భావించకూడదని, ఎస్పీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోరు పార్టీకి ఇబ్బందులు సృష్టించగలదని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ చర్య ప్రతిపక్ష కూటమిని బలహీనపరచడం కన్నా బలోపేతం చేస్తుందని ఎస్పీ నాయకుడు సర్వేష్ త్రిపాఠి వాదిస్తున్నారు.
కాంగ్రెస్ కంచుకోటలో ఎస్పీ ప్రచారం నిర్వహించడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు, మద్దతుదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వాదించారు. రాజకీయ విశ్లేషకుడు వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రాయ్‌బరేలీ యాత్రను రెండు మిత్రపక్షాల మధ్య ముప్పుగా లేదా పోటీగా భావించకూడదని అన్నారు.
యువత, ఉపాధి, విద్య, ఆరోగ్య సంరక్షణపై రాహుల్ గాంధీ కార్యక్రమాలు దృష్టి సారించాయని ఉదహరిస్తూ, రెండు పార్టీలు ఇప్పటికే తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నాయని, అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ చేపట్టిన ప్రధాన రాజకీయ కార్యక్రమం పీడీఏ ప్రచారమేనని ఆయన అభివర్ణించారు.
సీట్ల పంపకంపై చర్చలు..
రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌కు 55 సీట్లకు మించి ఇవ్వడానికి అఖిలేష్ యాదవ్ సుముఖంగా లేరని టెలిగ్రాఫ్ నివేదిక పేర్కొంది. 150 సీట్ల కంటే తక్కువకు పార్టీ అంగీకరించదని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ రాయ్ అన్నట్లు ఆ నివేదిక ఉటంకించింది.
ఈ నివేదికపై శ్రీవాస్తవ స్పందిస్తూ, ఎస్పీ ఎక్కువగా ఉత్తర ప్రదేశ్‌పై ఆధారపడి ఉందని, కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో ఉనికి ఉందని, అందువల్ల రెండు పార్టీల మధ్య రాజకీయ లెక్కలు భిన్నంగా ఉన్నాయని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ టీకే రాజలక్ష్మి ప్రకారం.. సీట్ల పంపకంపై జరుగుతున్న బహిరంగ చర్చను తమ స్థానాలను పటిష్టం చేసుకోవడం, బేరసారాల కలయికగా అభివర్ణించారు.
ప్రతి వ్యాఖ్య ప్రతిచర్యకు, మరిన్ని ఊహాగానాలకు దారితీయగలదు కాబట్టి, ఇటువంటి చర్చలు బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా లోలోన చేసుకోవడం ఉత్తమని, అది సమస్యను సామరస్యంగా పరిష్కరించగలదని పేర్కొన్నారు.
అయితే, రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతల ఆరోపణలను త్రిపాఠి తోసిపుచ్చారు. అఖిలేష్ యాదవ్ లేదా రాహుల్ గాంధీ నుంచి ప్రకటన వెలువడే వరకు ఎలాంటి ఊహాగానాలు మంచిది కాదని అన్నారు. ఆ ఇద్దరు నాయకులు ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
అవసరమైతే మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి ఎస్పీ సిద్ధంగా ఉందని కూడా ఆయన అన్నారు. బీజేపీని ఓడించడమే ప్రతిపక్షాల లక్ష్యం కావాలని, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కలిసి పనిచేయాలని త్రిపాఠి వాదించారు. రాష్ట్రంలో ఎస్పీ స్థానానికి నిదర్శనంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని 2024 లోక్‌సభ ఫలితాలను కూడా ఉదహరించారు.
పెద్ద సవాలు..
సీట్ల సంఖ్యపై ఉన్న విభేదాలను ఇరుపక్షాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, అయితే గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలను గుర్తించడమే పెద్ద సవాలు అని శ్రీవాస్తవ అన్నారు. బహిరంగంగా సీట్ల సంఖ్యపై చర్చించడం కంటే, ఏ పార్టీ వాస్తవంగా ఏ సీట్లు గెలవగలదో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని రాజలక్ష్మి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఇండియా కూటమి తన సంస్థాగత ఏర్పాట్లను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
Next Story

