బంకిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదా?
x
ప్రచారం చేస్తున్న నితిన్ నబిన్

బంకిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదా?

ప్రశాంత్ కిషోర్ కచ్చితంగా గెలుస్తాడా?


Click the Play button to hear this message in audio format

బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి సవాల్ ఎదురువుతుందని భావిస్తున్న జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, ఎలాగైన గెలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బీజేపీకి జాతీయ అధ్యక్షుడు అయ్యాక బంకిపూర్ స్థానం నుంచి రాజీనామా చేయడంతోనే ఈ ఉప ఎన్నిక అనివార్యం అయింది.

గత మూడు దశాబ్ధాలుగా ఆ స్థానం నుంచే ఎన్నికల్లో గెలుస్తూ ఉంది. గత మూడు రోజులుగా నితిన్ నబిన్ పాదయాత్ర చేస్తూ, ఇంటింటికీ తిరుగుతూ, జనసాంద్రత అధికంగా ఉన్న నివాస ప్రాంతాలలోని ఇరుకైన సందులలో ప్రజలను కలుస్తూ, దూకుడుగా ప్రచారం చేపట్టారు.

ఓటర్లతో మాట్లాడుతూ.. తాను ఇక్కడే పుట్టానని, ఈ ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేవాడినని చెబుతూ, నితిన్ వారి హృదయాలను గెలుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


గత మూడు వారాల్లో, నితిన్ తన సొంత ఊరైన పాట్నాను మూడుసార్లు సందర్శించి, ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి కోసం దూకుడుగా ప్రచారం చేయడానికి అక్కడే మకాం వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఏ అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా, ఈ పట్టణంలో ఓట్లు అభ్యర్థించడానికి నబిన్ చేసిన విధంగా వీధుల్లోకి రావడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు.
నితిన్ నబిన్ ఇదే నియోజకవర్గంలో ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కూడా పాదయాత్ర చేపట్టలేదు లేదా ఇంటింటి ప్రచారం నిర్వహించలేదు. 2006 నుంచి, 2025 వరకు ఆయన ఈ నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు.

బరిలో బలమైన పోటీదారుడు.

బంకిపూర్‌లో ఎలాంటి పోరు లేదని బీజేపీ నాయకులు బహిరంగంగా చేస్తున్న వాదనకు ఇది విరుద్ధంగా ఉంది. కానీ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే, ఈ నియోజకవర్గంలోని తమ సంప్రదాయ ప్రధాన ఓటర్ల మద్దతును పొందేందుకు బీజేపీ 50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అరడజను మంది ఎంపీలు, 16 మంది బీహార్ మంత్రులను రంగంలోకి దించింది. బంకిపూర్‌లో అధికార బీజేపీకి ఈ ఉప ఎన్నిక కఠినంగా ఉండబోతోందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.
దీనికి ప్రధాన కారణం, ఎన్నికల వ్యూహకర్తగా ఉండి జన సూరజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడిగా మారిన, పీకేగా ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ కిషోర్ ఈసారి బరిలో ఉండటమే. మార్చి 2026లో నబిన్ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత, ఆయన ఖాళీ చేసిన బంకిపూర్ స్థానానికి ప్రశాంత్ కిషోర్ బలమైన పోటీదారుగా రంగప్రవేశం చేయడంతో ఈ నెల ఆరంభంలోనే బీహార్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఇది ఆయనకు మొదటి ప్రత్యక్ష ఎన్నికల పోరు అయినప్పటికీ, ఈ జన సూరజ్ నాయకుడు బీజేపీకి స్పష్టంగా ఒక పెద్ద సవాలు విసురుతున్నారు.

బీజేపీ కంచుకోట- నితిన్ నబిన్ సొంత గడ్డ

ఈ స్థానం ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది బీజేపీ పట్టణ కంచుకోటలలో ఒకటి. నబిన్ సాంప్రదాయ సొంత గడ్డ. ఆయన పదేపదే తన "ఘర్" (ఇల్లు) అని పిలుచుకునే ప్రదేశం ఇది. పాట్నా నగర నడిబొడ్డున ఉన్న బంకిపూర్, బీజేపీకి కంచుకోటగా ఉంది.
1990వ దశకం మధ్యకాలం నుంచి ఈ సీటును ఆ పార్టీ వరుసగా గెలుచుకుంటూ వస్తోంది. ఇక్కడ నుంచి నబిన్ నాలుగు సార్లు, అతని తండ్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నబిన్ కిషోర్ సిన్హా కూడా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2008కి ముందు, ఈ అసెంబ్లీ సీటును పాట్నా వెస్ట్ అని పిలిచేవారు.
ఈ సీటు బీజేపీ చేతిలోనే ఉండేలా చూడాలని నబిన్ కోరుకుంటున్నారు. అందుకే, ఆయన రద్దీగా ఉన్న వీధుల్లోకి వెళ్లి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని, ఓటు వేయాలని చేతులు జోడించి ప్రజలకు విజ్ఞప్తి చేశారని నిపుణులు అంటున్నారు.
ప్రశాంత్ కిషోర్ బీజేపీ ప్రధానంగా అండగా ఉన్నా వర్గాలను చీల్చబోతున్నారని అంతర్గంగా అందుతున్న సర్వే. రాజకీయ పరిశీలకుల ప్రకారం, సాంప్రదాయ ఓటర్లలోని కొన్ని వర్గాలు బీజేపీ పట్ల స్పష్టంగా అసంతృప్తితో ఉన్నాయి. ఈ నివేదికలను పరిగణనలోకి తీసుకుని, ప్రతి ఓటరును చేరుకోవాలని, ప్రతి బూత్‌పై దృష్టి పెట్టాలని నబిన్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆదేశించారు.

ఆందోళనగా కనిపిస్తున్న కమలదళం..

ప్రచార చివరి రోజున తన రోడ్ షో, ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో నబిన్ ఆత్మవిశ్వాసంతో కనిపించేందుకు ప్రయత్నించారు. ఈ సభలో ఆయన, బంకిపూర్ ఒక అభేద్యమైన కోట అని, దానిని ఎవరూ బద్దలు కొట్టలేరని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ కొత్త రికార్డు సృష్టిస్తుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.
'జంగల్ రాజ్' భయాన్ని రేకెత్తించి, దాని పునరాగమనానికి ప్రజలు సహకరించవద్దని కోరినప్పుడు ఆయన తన ఆందోళనను దాచుకోలేకపోయారు. బంకిపూర్‌లో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన ప్రశాంత్ కిషోర్‌ను కాకుండా, తరచుగా రాష్ట్రీయ జనతా దళ్‌తో ముడిపడి ఉండే 'జంగల్ రాజ్' ప్రస్తావనను ఆయన ఎందుకు తెచ్చారో స్పష్టంగా తెలియడం లేదు.
పాట్నాకు చెందిన బీజేపీ కుంహారార్ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా మాట్లాడుతూ, "బంకిపూర్ మా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ గారి నియోజకవర్గం, ఈ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవడానికి మేమందరం కృషి చేస్తున్నాము.
సమాజంలోని అన్ని వర్గాల్లో ఆయనకున్న ప్రజాదరణ, ఆమోదం కారణంగా నితిన్ గారు బంకిపూర్‌లో అద్భుతమైన మెజారిటీతో గెలుస్తూ వచ్చారు. నితిన్ గారి ఉనికి వల్ల సామాజిక సమీకరణం మరోసారి పార్టీకి అనుకూలంగా ఉంది." అని అన్నారు.
పాట్నాలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) మాజీ ప్రొఫెసర్, రాజకీయ పరిశీలకుడు అయిన పుష్పేందర్ కుమార్ ప్రకారం.. ప్రజల తలుపులు తట్టి, వ్యక్తిగతంగా వారి ఓట్లను అభ్యర్థించడానికి నబిన్‌కు ఉన్న 'రాజకీయ అవసరం' కారణమని అభిప్రాయపడ్డారు.
"బీజేపీ భయపడుతోంది. విద్యార్థుల నిరసన, నిరసనకారులపై పోలీసుల అణచివేత, క్రూరత్వం బంకిపూర్‌లో కూడా ప్రభావం చూపడం ఖాయం. ఇది సునాయాసంగా గెలిచే విజయం కాదని గ్రహించిన నితిన్ నబిన్, ఓటర్లను ప్రభావితం చేయడానికి, ఒప్పించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఓటర్లు ఇకపై సుముఖంగా లేరు. పైగా పార్టీపై బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు" అని ప్రొఫెసర్ కుమార్ అన్నారు.

ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు..

ప్రొఫెసర్ అభిప్రాయాలతో బంకిపూర్‌లోని పలుచోట్ల ప్రజలు ఏకీభవిస్తున్నారు. ఈసారి ప్రజలు మార్పు గురించి మాట్లాడుతుండటం బంకిపూర్‌లో గమనించదగ్గ విషయం. "మనం మార్పు కోసం ఓటు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నికలలో బీజేపీకి ఓటు వేయడంతో, బీజేపీ మమ్మల్ని తేలికగా తీసుకుంది. ఒక కొత్త ముఖం కొంత మార్పును తీసుకువస్తుంది" అని బంకిపూర్‌లోని కదమ్‌కువాన్ సమీపంలో బట్టల దుకాణం యజమాని అయిన గజేందర్ ప్రసాద్ 'ది ఫెడరల్'తో అన్నారు.
భట్టాచార్య రోడ్డు నివాసి, గృహిణి అయిన సంజనా దేవి కూడా మార్పును కోరుకున్నారు. "బంకిపూర్‌లో మార్పు రాబోతోంది. బీజేపీ ఇప్పుడు ఒకప్పటిలా లేదు, ధరల పెరుగుదల మనందరినీ దెబ్బతీస్తోంది, పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన విద్యార్థులను దారుణంగా కొట్టి, అరెస్టు చేసి, దేశద్రోహులుగా చిత్రీకరించారు. దీని కోసమేనా మనం మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఓటు వేసింది?" అని ఆమె ప్రశ్నించారు.
గాంధీ మైదాన్ సమీపంలో నివసించే, నిరసనకారులలో ఒకరైన కళాశాల విద్యార్థి రూపేష్ కుమార్ సింగ్, పాట్నా, న్యూఢిల్లీలలో నిరసన చేస్తున్న విద్యార్థుల పట్ల బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తన బాధను, ఆవేదనను వ్యక్తం చేశారు. “బంకిపూర్‌లో బీజేపీకి గుణపాఠం నేర్పాలని మేము నిశ్చయించుకున్నాము, మేమందరం మార్పు కోసమే ఓటు వేస్తాము” అని అన్నారు.

బీజేపీకి నిజంగానే నష్టం జరుగుతుందా?

బీజేపీ కంచుకోట, తన సొంత గడ్డ అయిన బంకిపూర్‌ను కాషాయ పార్టీ చేతిలోనే ఉంచుకోవడానికి నితిన్ నబిన్ ఇంత ఉధృతంగా ప్రచారం చేయవలసి వచ్చిందని రాజకీయ విశ్లేషకుడు సోరూర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
“బంకిపూర్‌లో హోరాహోరీ పోరుకు కనీసం మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ స్వయంగా బలమైన పోటీదారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గణనీయమైన విద్యావంతుల వర్గం ఉంది. దీనికి విరుద్ధంగా, బీజేపీ తన అభ్యర్థి అభిషేక్ కుమార్‌ను మార్చి, రాజకీయంగా అంతగా ప్రాధాన్యత లేని నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపడం ద్వారా తన బలహీనతను బయటపెట్టుకుంది.
రెండవది, రామ మందిర్ ట్రస్ట్ నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారనే ఆరోపణలు బీజేపీ మద్దతుదారులలో ఒక పెద్ద వర్గాన్ని అకస్మాత్తుగా పునరాలోచనలో పడేశాయి. చివరిగా, గత వారం నుంచి విద్యార్థుల ఆందోళనలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఎందుకంటే బంకిపూర్ ఈ నిరసనలకు ప్రధాన కేంద్రాలలో ఒకటిగా ఉంది.” అని అహ్మద్ అభిప్రాయపడ్డారు.
అహ్మద్ మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్థికి గట్టి పోటీ లేదని బీజేపీ నాయకులు చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు మరో కథ చెబుతున్నాయి. ఎందుకంటే 1995 తర్వాత బీజేపీ అత్యంత కఠినమైన ఎన్నికలను ఎదుర్కొంటోంది. "నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జెన్ జీ విజయవంతంగా జరిపిన నిరసన, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా వారికి ఇబ్బందులు సృష్టించాయి" అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఉప ఎన్నికలలా కాకుండా, బంకిపూర్ ఒక సాధారణ ఉప ఎన్నిక కాదు. ఇది బీహార్ మొదటి బీజేపీ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరికి ఎదురవుతున్న మొదటి ఎన్నికల సవాలు.
ఆయన అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. దీనికి తోడు, ఈ ఉప ఎన్నిక సమ్రాట్ చౌదరి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒక ప్రజాభిప్రాయ సేకరణ అని కిషోర్ పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు.
"బీహార్‌లో బీజేపీ ప్రభుత్వ ప్రజాదరణకు బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఒక ప్రజాభిప్రాయ సేకరణ కానుంది. బంకిపూర్ ప్రజలు బీహార్‌లోనే అత్యంత ధనవంతులు, అత్యంత విద్యావంతులు. వారు నాపై విశ్వాసం ఉంచగలరని నేను భావిస్తున్నాను," అని ఆయన అన్నారు.

బీజేపీకి అహంకారం నెత్తికెక్కింది..

బీజేపీ అహంకారంపై కిషోర్ విమర్శలు గుప్పించారు. కుక్కనో, పిల్లినో బరిలోకి దింపినా బంకిపూర్‌లో బీజేపీ గెలుస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ నాయకుల అహంకారాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీజేపీని ఇబ్బంది పెట్టడానికే ఆయన ఈ వ్యాఖ్యను ప్రముఖంగా ప్రస్తావించారు.
"తమ పార్టీ టికెట్‌పై పిల్లినో, కుక్కనో బరిలోకి దింపితే బంకిపూర్‌లో గెలవగలదని చాలా మంది బీజేపీ నాయకులు చెప్పడం ప్రజలు వింటున్నారు. ఈ నియోజకవర్గ ఓటర్లను బీజేపీ చూసే తీరు, వారిని తేలికగా తీసుకునే విధానం ఇది. కానీ జన సూరజ్ విజయం బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పుతుంది," అని కిషోర్ అన్నారు.
2025లో జరగాల్సిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలిసారిగా పోటీ చేసి విఫలమైన దాదాపు తొమ్మిది నెలల తర్వాత, గత నాలుగైదేళ్లుగా తాను కన్నేసిన ఈ సీటును గెలుస్తామనే ఆశాభావంతో జన సూరజ్ పార్టీ (జేఎస్పీ) నాయకుడు కనిపిస్తున్నారు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, గత ఏడాది ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 స్థానాలకు గాను 238 స్థానాల్లో జేఎస్పీ పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పార్టీ 3 శాతం ఓట్ల వాటాను మాత్రమే పొందింది. ఇది కూడా కిషోర్ ఆశించిన దానికంటే తక్కువ.
తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో జేఎస్పీ పేలవమైన ప్రదర్శన చేసినప్పటికీ, ఈసారి మార్పు తీసుకువస్తామని కిషోర్ ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావంతో ఉన్నారు. ఆగష్టు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Read More
Next Story