‘ఓట్ చోరీ’ ద్రోహులను వదిలేది లేదు: రాహుల్ గాంధీ
x

‘ఓట్ చోరీ’ ద్రోహులను వదిలేది లేదు: రాహుల్ గాంధీ

ఎన్నికల్లో గెలవలేక వీధి పోరాటాలు చేస్తూ అరాచకం సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న బీజేపీ


Click the Play button to hear this message in audio format

ఢిల్లీలోని ఎన్నికల సంఘం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించి, కుదరకపోవడంతో ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి చొరబడి ఎనిమిది గంటల పాటు ధర్నా చేయడంతో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, రాత్రి పది గంటల తరువాత వదిలిపెట్టారని వెల్లడించింది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, రాహుల్ గాంధీతో సహ ఇతర విపక్షనాయకులందరిని కింగ్స్ వే క్యాంపస్ లోని న్యూ పోలీసస్ లైన్ వద్ద ఉన్న గేటు దాటి లోపలికి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికే చేరుకున్నారు.
ఓట్ చోరీ అంటూ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిన్న నిరసనలకు దిగారు.

ఒక్క ద్రోహిని కూడా వదిలిపెట్టము..

రాహుల్ తో పాటు, కేసీ వేణుగోపాల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, పవన్ ఖేరా, కే. సురేశ్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, దీపేందర్ హూడా, ప్రణితీ షిండే, వర్షా గైక్వాడ్ ఇలా ఇతర కాంగ్రెస్ నాయకులను బలవంతంగా ఆకాశ వాణి ప్రాంగణం నుంచి బలవంతంగా తొలగించారు. తనను అరెస్ట్ చేసిన వెంటనే ఎక్స్ లో ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. ‘‘ప్రజాస్వామ్య ద్రోహులను కాపాడటానికి, ప్రజాస్వామ్య అవశేషాలను బురదలో తొక్కడానికి ప్రయత్నించారు. దీనికి లెక్క ఉంటుంది. ఒక్క ద్రోహిని కూడా వదిలిపెట్టరు’’ అని ఆయన అన్నారు.

నిరసనలు...

ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసి పాదయాత్ర ప్రారంభించినప్పటికీ పోలీసులు వారి యాత్రను నిలిపివేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం బారికేడ్లను ఎక్కి, తమ బృందాన్ని ఎన్నికల కమిషనర్ కలవనివ్వాలని పట్టుబట్టారు. అయితే పెద్ద సంఖ్యలో పోలీసులు ప్రతిపక్షనాయకులందరిని అరెస్ట్ చేసి వ్యాన్లలో పోలీస్ స్టేషన్లకు తరలించారు. దాదాపు 250 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలలో టీఎంసీ (మమతా వర్గం), ఎస్పీ ఎంపీలను వేర్వేరు వాహానాలలో పోలీసులు తరలించారు.

మోదీ, షా దేశాన్ని హైజాక్ చేశారు..

ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఓటు చోరీతో దేశాన్ని హైజాక్ చేశారని వీరికి జ్ఞానేశ్ కుమార్ సాయం చేశారని ఆయన అన్నారు.‘‘మన దేశానికి ద్రోహం జరిగింది. ఎవరూ తప్పించుకోలేరు’’ అని ఆయన ఉద్ఘాటించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు 300 మంది లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో కలసి నిలబడ్డానని, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు అన్నారు.

ఖర్గే ఏమన్నారంటే...

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ శాంతియుత ధర్నాను నిలిపివేయాలనుకోవడం, అనేది తమ పతనం ఆసన్నమైందని తెలిసిన ప్రభుత్వానికి సంకేతం అని కాంగ్రెస్ అభివర్ణించింది. ‘‘ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రవర్తనలో గణనీయమైన ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది’’ అని కాంగ్రెస్ పార్టీ అధినేత అన్నారు. రాహుల్ గాంధీని నిర్భంధంగా తీసుకెళ్తున్న దృశ్యాలను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఎంపీ శశి థరూర్ అన్నారు.

విరుచుకుపడిన బీజేపీ...

రాహుల్ ఆందోళన తరువాత బీజేపీ పత్రికా సమావేశాలు నిర్వహించి ఆ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఎన్నికల వల్ల గెలవలేక, దేశంలో అరాచకం సృష్టించి అధికారంలోకి రావడం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించింది. నిరసనలు కేవలం వీధి నాటకం అని, ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మెప్పు పొందేందుకు పనిచేయకుండా ఓటు చోరీ అంటూ నిరాధారమైన ఆరోపణలతో అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని కమలదళం ఆరోపించింది.
‘‘వాస్తవానికి రాహుల్ గాంధీ ‘కామ్ చోర్’( సోమరీపోతు), ఓటు దొంగ ఆరోపణలు చేస్తున్నాడు.’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేదీ ఆరో్పించారు. ‘‘ రాహుల్ గాంధీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో కనీసం వారం లేదా రెండు వారాల పాటు ఎన్నిసార్లు మకాం వేసి పార్టీ తరఫున ప్రచారం చేశారు’’? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఓటముల నిరాశను ఈ యాత్ర ద్వారా వెళ్లగక్కుతున్నారని, రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాటిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గందరగోళాల ద్వారా మీడియా దృష్టిని రాహుల్, ప్రియాంక పై నిలపడానికి ఈ ప్రదర్శన నిర్వహించారని ఆరోపించారు.
ఎన్నికల సంఘం అపాయింట్ మెంట్ కోసం ఇండి కూటమి గానీ, కాంగ్రెస్ గానీ అసలు అపాయింట్ మెంట్ తీసుకోలేదని అన్నారు. ఈసీకి వారు ఇచ్చే మెమోరాండం లేదా వినతిపత్రాన్ని తీసుకోవడానికి సిద్దంగా ఉన్నప్పటీకీ అసలు ఈసీ కలవకుండా ఆందోళన చేశారని వారు చెప్పారు.
ఇది కాంగ్రెస్ అబద్దాలను బట్టబయలు చేసిందని అన్నారు. నిరసనల్లో 300 మంది ఎంపీలు పాల్గొన్నారనే కాంగ్రెస్ వాదన పచ్చి అబద్దం అని కొట్టిపారేశారు. ఇండి బ్లాక్ ఎంపీల సంగతి సరే.. కనీసం కాంగ్రెస్ ఎంపీలు కూడా సాయంత్రం వరకూ ఒక్కరూ కూడా కనిపించలేదని అన్నారు.
ఎన్నికల వైఫల్యాలకు ఎన్నికల సంఘాన్ని దూషించడం మాని, ప్రజల తీర్పును శిరసావహించాలని, ప్రజలకు సేవ చేయాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, రాహుల్ కు సూచించారు. ‘‘2014 నుంచి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఆడుతున్న నాటకానికి ఇక తెరదించాల్సిన సమయం వచ్చింది’’ అని ఆయన అన్నారు. విదేశీ శక్తులు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్టపాలు చేయడానికి, భారత ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నిరంతరం తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని రిజిజు అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పులను సైతం రాహుల్ గాంధీ వక్రీకరిస్తూ, గందరగోళం సృష్టించి, తన రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని సంబిత్ పాత్ర అన్నారు.
Read More
Next Story