
పిలిభిత్ లో వేల మంది ఓటర్లను తొలగించారు: కాంగ్రెస్ ఆరోపణ
అక్టోబర్ 24 వరకూ సమయం ఉందన్న ఎన్నికల సంఘం
ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు సాగుతున్న ‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పిలిభిత్ అసెంబ్లీ నియోజకవర్గంలో సర్ ప్రక్రియతో 16 వేల మందికి పైగా ఓటర్ల విషయంలో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని యూపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ బుధవారం ఆరోపించారు. యూపీలోని పీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గౌతమ్ మాట్లాడారు. 13,150 మంది ఓటర్ల ఎపిక్ నంబర్ లు మార్చినప్పటికీ, జూలై, సెప్టెంబర్ నెలలో వారి పేర్లు మార్చారని ఆరోపించారు.
ఇదే నియోజకవర్గంలో దాదాపు 804 మంది ఓటర్లను తొలగించారని, వారు ఇప్పుడు తమను చేర్చాలని, కోరుతున్నారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. అదేవిధంగా 2400 కు పైగా అనుమానాస్పద ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని పార్టీ ఆరోపిస్తోంది.
ఎన్నికల సంఘం నేరుగా మార్పులు చేసిందని, ప్రభావిత నియోజక వర్గాల్లోని జిల్లా మేజిస్ట్రేట్లు అటువంటి మార్పులు చేయడానికి తమకు సాప్ట్వేర్ అందుబాటులో లేదని పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే ఆరోపించారు.
ఓటర్ల జాబితా...
ప్రాంతీయ ఎన్నికల నమోదు అధికారులను పక్కనపెట్టి, ఈసీఐనెట్, ఈఆర్ఓనెట్ వంటి సాప్ట్వేర్ ప్లాట్ ఫారమ్ లను ఉపయోగించి ఒక కేంద్రీకృత ప్రక్రియ ద్వారా చట్టబద్దమైన ఓటర్లను తొలగించి, మోసపూరిత ఓటర్లను చేరుస్తున్నారని ఆరోపిస్తూ, భారత ఎన్నికల సంఘం ఐటీ డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నాను కూడా శ్రీనాథ్ లక్ష్యంగా చేసుకున్నారు.
‘‘సీమా ఖన్నా ఈమె ఎన్నికల సంఘంలో టెక్నాలజీ, సాప్ట్వేర్ విభాగాధిపతి. ఈ రోజుల్లో ఆమ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. సాప్ట్వేర్ ద్వారా వ్యక్తుల పేర్లు తొలగించడం, చేర్చడం,మార్చడం వంటి ఇతర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న నివేదికలను మీరందరూ చూశారు. తమకు ఆ సాప్ట్వేర్ యాక్సెస్ లేదని, డీఎంలు, ఎస్డీఎంలు, ఏడీఎంలు, ఈఆర్ఐలు పదే పదే చెబుతున్న నివేదికలను కూడా మీరు చూశారు’’ అని శ్రీనాథ్ ఆరోపించారు.
కాంగ్రెస్ ఆరోపణలపై బృందం..
‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. పిలిభిత్ ఎన్నికల నమోదు అధికారి హేమంత్ కుమార్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ధృవీకరించడానికి కమిషన్, జిల్లా యంత్రాంగం ఒక బృందాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. ఆరోపణలు నిజమైనవో లేక తప్పుదోవ పట్టించేవో మేము చెప్పలేము. అవసరమైతే తదనుగుణంగా మార్పులు చేస్తాం. అక్టోబర్ 24న మేము ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాము. అక్కడ బాధితులు, సంబంధిత పత్రాలు, వినతిపత్రాలను బీఎల్ఓలకు సమర్పించి, తమను కూడా చేర్చాలని కోరవచ్చు’’ అని చౌదరి అన్నారు.
అఖిలేష్ ఆందోళనలు..
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎన్నికల సంఘం ఇలాంటి ఆరోపణలే చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా, సవరణల కోసం పార్టీ కార్యకర్తలు ఈ జాబితాలు బూత్ స్థాయి అధికారులకు అందించారని ఆ పార్టీ చెబుతోంది.
అజంగఢ్ కు చెందిన వికాస్ యాదవ్ అనే యువ ఓటర్ ను ఉదాహారణగా చూపుతూ, కనీసం 14 మంది వేర్వేరు ఓటర్లు ఒకే పేరుతో నమోదయ్యారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన వంతుగా రాష్ట్రంలోని 75 జిల్లాలంతటా కొత్త ఓటర్లను చేర్చడమే కాకుండా, గత ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో ప్రారంభించిన సర్ ప్రక్రియలో విస్మరించబడిన అర్హులైన ఓటర్లను చేర్చడానికి ఓటర్ల జాబితాలో సవరణలు, దిద్దుబాట్లు కూడా చేపట్టేందుకు ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 24న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల చేర్పుకోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Next Story

