
నూడిల్స్ వల్ల కాదు.. ఆత్మహత్య చేసుకున్నారా?
నోయిడా అనుమానాస్పద మృతుల కేసులో పోలీసుల అనుమానం, ముగ్గురి అరెస్ట్
గ్రేటర్ నోయిడాలోని ఒక గ్రామంలో దంపతులు, వారి ముగ్గురు పిల్లలు తమ ఇంట్లో చనిపోయిన సంఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతుడి ఇద్దరు చెల్లెలు, బావ సహ ఇతర సహ నిందితులను అరెస్ట్ చేసినట్లు రబుపుర ఎస్ హెచ్ ఓ సుజీత్ ఉపాధ్యాయ తెలిపారు.
బాధిత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందు రోజు రాత్రి ఆ కుటుంబం టీ, నూడుల్స్ తిన్నారని, ఫుడ్ పాయిజన్ అనిపించాయి. అయితే పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం మాత్రం వారి శరీరాల్లో విషపు ఆనవాళ్లు ఉన్నాయి.
విష ప్రయోగం..
నివేదికలలో విష ప్రయోగం జరిపినట్లు సంకేతాలు కనబడటంతో వైద్యులు పరీక్షల కోసం ఐదు మృతదేహాలలోని అంతర్గత అవయవాలను భద్రపరిచారు. ఆ నమూనాలను ఒక ప్రయోగశాలకు పంపించారు.
చనిపోయిన వారిని మహేశ్(37), అతని భార్య లలిత(35), వారి మైనర్ కుమార్తె, ఇద్దరు మైనర్ కుమారులుగా తేలింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే రబుపురా సమీపంలోని నాగ్లా శ్రీపదం గ్రామంలోని వారి ఇంట్లో శనివారం ఉదయం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
వాయిస్ నోట్ లో ఆరోపించబడిన కుటుంబ వివాదం గురించి ప్రస్తావించబడింది. మహేశ్ చనిపోవడానికి ముందు తన మొబైల్ ఫోన్ లో ఒక వాయిస్ నోట్ ను రికార్డు చేశాడని ఇండియా టుడే నివేదించింది. అందులో అతను తన కుటుంబ దుస్థితికి తన ఇద్దరు సోదరీమణులను, బావను ఇందుకు కారణంగా చెప్పారు.
మహేశ్ ను, అతని కుటుంబాన్ని ఈ ముగ్గురు వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహేశ్ బావ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఫిర్యాదు ఆధారంగా వారిపై కేసు నమోదు చేశారు. అయితే వీరి పాత్ర ఉందో లేదో అని విచారణ చేస్తున్నామని చెప్పారు.
ఆస్తి వివాదం..
ఈ కుటుంబం దీర్ఘకాలంగా ఆస్తి వివాదంలో చిక్కుకుంది. తమ ప్రాథమిక విచారణలో ఇదే ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు వాయిస్ నోట్, ఆస్తి వివాదం, మరణాలకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్ లైన్ లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం: 044 24640050, ఆత్మహత్య నివారణ మానసిక గాయాల హెల్ప్ లైన్ 91 9820466726, కిరణ్ మానసిక ఆరోగ్య పునరావాసం 1800 5990019, దిశ 0471 2552056, మైత్రి 0484 2540530, స్నేహ ఆత్మహత్య నివారణ హెల్ప్ లైన్ 044 24640050)
Next Story

