
పాకిస్తాన్ లేకుంటే కశ్మీర్ ప్రజలు లేరు: ఫరూక్ అబ్దుల్లా
అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్లిపో: బీజేపీ
తెలంగాణలో పల్లె ప్రజలు వాడే ఓ నాటు సామెత ఉంది. పూర్తిగా చెబితే బాగుండదు కాదు.. మొదటి లైన్ రాస్తే ఈ సందర్భానికి అతినట్లు ఉంటుంది. అదేంటంటే.. ‘‘తినేది మొగుడి సొమ్ము.. పాడేది..... పాట’’ అలా ఉంది జమ్మూకశ్మీర్ లో అధికారం ఏలుతున్న అబ్దుల్లాల మాటలు.
జమ్మూకశ్మీర్ ను పాకిస్తానే కాపాడుతోందని మరోసారి గుంటనక్క మాటలు మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ప్రస్తావిస్తుండటమే తమకు రక్షణగా నిలుస్తోందని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై దేశద్రోహ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో శనివారం, అక్టోబర్ 24న జరిగిన పార్టీ కార్యక్రమంలో ఫరూక్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కశ్మీర్ ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశలు తక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ హక్కులు, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదంటూ పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తుండటంతో ప్రపంచ దేశాల దృష్టి ఈ అంశంపై కొనసాగుతోందని, అదే తమకు రక్షణగా ఉందని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలపై వివక్ష కొనసాగుతోందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. మసీదులు, ఇళ్లు, దుకాణాలను కూల్చివేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు పెంచడం దేశ సమైక్యతకు నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, జమ్మూకశ్మీర్ ప్రజలు ఎప్పుడూ భారతీయులమని చెప్పుకోవడానికి వెనుకాడలేదని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణమైన భారతదేశంతోనే తమ అనుబంధమని ఆయన పేర్కొన్నారు.
ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఆయన వ్యాఖ్యలను దేశద్రోహపూరితమైనవిగా అభివర్ణిస్తూ, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదం కారణంగా జమ్మూకశ్మీర్ దశాబ్దాలుగా హింస, రక్తపాతం, అభద్రతను ఎదుర్కొందని ఆయన గుర్తుచేశారు. అలాంటి దేశాన్ని కశ్మీరీల రక్షకుడిగా చిత్రీకరించడం సరికాదని విమర్శించారు.
మొత్తంగా, కశ్మీర్ సమస్యపై ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ మధ్య మరోసారి రాజకీయ విభేదాలను ముందుకు తెచ్చాయి. ఈ అంశంపై ఇరు పక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, వ్యాఖ్యలపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.
ఈ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ స్పందించారు. ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి పాకిస్తాన్ పాట పాడటం ఏంటనీ ప్రశ్నించారు. అబ్దుల్లా అంతగా పాకిస్తాన్ ను ప్రేమిస్తే అక్కడికి వెళ్లాలని ఆయన చెప్పారు.
‘‘పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ లో నివసిస్తున్న ప్రజలు పాకిస్తాన్ దుష్పరిపాలన నుంచి స్వేచ్ఛ కోసం తీవ్రంగా ఆరాటపడుతున్నారు. భారత్ లో చేరాలని కోరుకుంటున్నారు. ఆయన ఇక్కడి నుంచి పాకిస్తాను కీర్తించడం మానేసి, వాస్తవాలను తెలుసుకోవాలి’’అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ ఎగమతి చేసిన ఉగ్రవాదం వల్ల జమ్మకశ్మీర్ తీవ్రంగా బాధపడిందని అన్నారు. పాకిస్తాన్ కాశ్మీర్ కు తీవ్రవాదం, రక్తపాతం, భయం, అనిశ్చితి తప్ప మరేమీ ఇవ్వలేదని కాశ్మీర్ ప్రజలు ఈ బాధాకరమైన చరిత్రను మర్చిపోయి పాకిస్తానే తమ రక్షకుడని నమ్ముతారని ఫరూఖ్ అబ్దుల్లా ఆశిస్తున్నారా?’’ అని ఆ బీజేపీ నాయకుడు అన్నారు.
కాశ్మీర్ కోసం ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బంది, పౌరులు చేసిన త్యాగాలను నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వం తరుచుగా గుర్తించడం లేదని బీజేపీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story

