
ప్రధాని నరేంద్ర మోదీ
ఈశాన్య రాష్ట్రాలు దేశానికి ‘‘అష్టలక్ష్మిలు’’: ప్రధాని మోదీ
యాక్ట్ ఈస్ట్ లను ఆక్ట్ ఫాస్ట్ గా మార్చాలని నిర్ణయించుకున్నామని వెల్లడి
ఈశాన్య రాష్ట్రాలు దేశానికి ‘అష్టలక్ష్మి’ లు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం 'యాక్ట్ ఈస్ట్' విధానానికి అతీతంగా ఈ ఎనిమిది రాష్ట్రాల కోసం 'యాక్ట్ ఫాస్ట్' చేయడానికి నిశ్చయించుకుందని అన్నారు. దేశపు 'అష్టలక్ష్మి' శ్రేయస్సు, సంపద, శుభప్రదమైన బహుముఖ స్వభావాన్ని సూచిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. "సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాలను భారతదేశపు 'అష్టలక్ష్మి' అని మోదీ అభివర్ణించారు.
పర్యాటక రంగానికి ఊపు..
గాంగ్‌టక్‌లో సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ స్వర్ణోత్సవాల ముగింపు వేడుకలో ఆయన ప్రసంగించారు. పర్యాటక రంగమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అని, పర్యాటకుల రాకను పెంచడానికి దాని అనుసంధానాన్ని మెరుగుపరచడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మోదీ చెప్పారు. రాష్ట్రానికి రోప్‌వే, స్కైవే ప్రాజెక్టులు రానున్నాయని, పర్యాటకుల రాకపోకలను పెంచేందుకు నాథులాలో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని ఆయన అన్నారు.
"పర్యాటకుల రాకపోకలను పెంచేందుకు, పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా నుంచి ఎక్స్‌ప్రెస్‌వే, గాంగ్‌టక్‌లో రింగ్ రోడ్ నిర్మించడంతో సహా సిక్కిం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని మోదీ సభకు తెలిపారు.
పర్యావరణ-ఆరోగ్య పర్యాటకం..
రాష్ట్ర జీవవైవిధ్యంపై ఆయన మాట్లాడుతూ, "సిక్కింలో ప్రకృతి, సంస్కృతి సజీవంగా ఉంటాయి. రాష్ట్ర రహదారుల పరిశుభ్రత, గాలి స్వచ్ఛత ఇక్కడి ప్రజలు ప్రకృతి పరిరక్షణకు నిజమైన బ్రాండ్-అంబాసిడర్లు అని చూపిస్తున్నాయి" అని అన్నారు.
సేంద్రీయ వ్యవసాయం వంటి కార్యక్రమాల ద్వారా సిక్కింతో సహా ఈశాన్య ప్రాంతం భవిష్యత్ వృద్ధికి, సుస్థిర అభివృద్ధికి కేంద్రంగా మారనుందని మోదీ నొక్కి చెప్పారు. "సిక్కింలో పర్యావరణ-ఆరోగ్య పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. దీనిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
దాదాపు 1,000 హోమ్‌స్టేలు నిర్మిస్తున్నాము. సాహస పర్యాటక రంగానికి మౌలిక సదుపాయాల పరంగా ప్రోత్సాహం లభిస్తోంది" మతం- రాజకీయ అనుబంధాల ఆధారంగా దేశాన్ని విభజించడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో, సిక్కిం 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్'ను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
'తూర్పు స్వర్గం'
సిక్కింను తూర్పు స్వర్గంగా అభివర్ణిస్తూ, దాని సహజ సౌందర్యం కోసం, ముఖ్యంగా దాని వైవిధ్యమైన ఆర్కిడ్‌ల కోసం రాష్ట్రాన్ని సందర్శించాలని ప్రధానమంత్రి పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. ఉదయం వర్ధమాన క్రీడాకారులతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధానమంత్రి, "సిక్కింలో క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడానికి ముఖ్యంగా ఫుట్‌బాల్, ఆర్చరీలో ప్రతిభను మెరుగుపరచడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది" అని అన్నారు.
సిక్కిం అభివృద్ధి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపిస్తూ విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ సిక్కింలో ఆరోగ్య సేవలను నిర్లక్ష్యం చేసింది.""ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ప్రజలకు నాణ్యమైన, సరసమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉంది" అని ప్రధానమంత్రి చెప్పారు.
Next Story

