నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణల నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) మే 3న జరగాల్సిన నీట్ (NEET UG 2026) 2026 పరీక్షను మంగళవారం (మే 12) రద్దు చేసింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని ఆదేశించింది.
మరోసారి పరీక్ష...
దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తారు. పునఃపరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను విడిగా ప్రకటిస్తామని ఏజెన్సీ తెలిపింది. మే 11న జారీ చేసిన ఒక ప్రకటనలో, పలు ఏజెన్సీల నుంచి అందిన సమాచారాన్ని సమీక్షించి, కేంద్ర అధికారులతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA పేర్కొంది.
పారదర్శకతను కాపాడటానికి, జాతీయ పరీక్షా ప్రక్రియ సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడానికి ఈ చర్య అవసరమని తెలిపింది. "కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో ఎన్‌టిఎ తదనంతరం పరిశీలించిన సమాచారం, చట్ట అమలు సంస్థలు పంచుకున్న దర్యాప్తు నివేదికల ఆధారంగా, భారత ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, 2026 మే 3న జరగాల్సిన నీట్ (యూజీ) 2026 పరీక్షను రద్దు చేసి, విడిగా ప్రకటించబోయే తేదీలలో తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది," అని ఆ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎలా లీక్ అయిందంటే...
‘పరీక్ష జరగటానికి నెల రోజుల ముందు నుంచే ఈ గెస్ పేపర్ అంటూ ఒక పేపర్ విద్యార్థుల్లో చక్కర్లు కొడుతే ఉంది. అందులో410 ప్రశ్నలు ఉన్నాయి. విచిత్రమేమిటంటే, నీట్ కెమిస్ట్రీ పరీక్ష పేపర్ నాలుగు సెట్లకు సంబంధించిన 120 ప్రశ్నలు గెస్ పేపర్ లో యధాతధంగా ప్రత్యక్ష మయ్యాయి. ఈ గెస్ పేపర్ ను ఎవరు సెట్ చేశారు, 120 ప్రశ్నలు వాళ్లకి ఎలా అందాయి, ఎవరు దీనిని సర్క్యులేట్ చేస్తున్నారు అనే దాని మీద ఇపుడు దర్యాప్తు జరుగుతూ ఉంది.
నీట్ పరీక్ష పత్రం మహారాష్ట్రలోని నాసిక్‌లో సెక్యూరిటీ ప్రెస్ లో ప్రింట్ అవుతుంది. అక్కడి నుంచే పేపర్ లీకేజీ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు వర్గాల ప్రకారం నాసిక్ నుంచి బయటకొచ్చిన పేపర్ హరియాన లోని గురుగ్రాంకు చెందిన ఒక డాక్టర్ వద్దకు చేరింది. ఈ డాక్టర్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉండే మరొక వ్యక్తి వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి అదే రాష్ట్రంలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లకు కేంద్రమయిన సికార్ పట్టణానికి చేరింది. అందులో కూడ అక్కడ ఎంబిబిఎస్ చదవాలనుకునే అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఏజెంట్‌గా పని చేస్తున్న రాకేశ్ కుమార్ చేతుల్లో పడింది. అతగాడు ఈ ‘గెస్ పేపర్’ ను రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్లకు వెళ్లింది. తెలుగు రాష్ట్రాల కోచింగ్ సెంటర్లు యజమానుల్లో కూడా కొందరు మహామహులున్నారు. ప్రభుత్వాల ద వీళ్లకు ఉన్నపట్టు అంతా ఇంతాకాదు, ఇలా సికార్ నుంచి వచ్చిన గెస్ పేపర్ తెలంగాణ, ఆంధ్రలలోని కోచింగ్ సెంటర్లు చేరిందా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే, ఏపీ, తెలంగాణకు కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయన్న వార్త అయితే బలంగా వినబడుతూ ఉంది. గతంలో తెలంగాణ గ్రూప్ వన్ పేపర్లను ఎలా అమ్ముకున్నారు ఈ గెస్ పేపర్‌ను కూడా రూ.30 వేల నుంచి మూడు నాలుగు లక్షల రూపాయల వరకు ధర పెట్టి అమ్మేసినట్లు వార్థులు వెలువడుతున్నాయి. కోచింగ్ తీసుకోవటానికి సికార్‌కు వచ్చిన నాగ్‌పూర్‌నకు చెందిన ఓ విద్యార్థి ఏకంగా రూ.28 లక్షలు చెల్లించినట్లు పోలీసులుకనుగొన్నారు. తెలంగాణ గ్రూప్ వన్ పేపర్ లీక్ ను గుర్తుకు తెచ్చేలా గెస్ పేపర్ మార్కెటింగ్ జరిగిందివ. ఏజెంట్లు ఒకర్ని మించి మరొకరు సొమ్ము చేసుకునే ఉద్దేశంతో విచ్చలవిడిగా పేపర్‌ను విక్రయించడంతో గెస్ పేపర్ రహస్యం బయటపడింది.
రద్దుకు గల కారణాలు..
ఈ మే 3వ తేదీన జరిగిన పరీక్షలో నాలుగు సెట్‌ల ప్రశ్నాపత్రాలున్నాయి. వాటిలో మొత్తానికి మొత్తంగా ఏదీ లీకేజీ కాలేదు. అయితే, గెస్ పేపర్ గా బయటకు సర్క్యులేట్ అయిన దానిలో ఒక కాపీలోని చాలా ప్రశ్నలు కనిపించాయి. దీనితో ప్రశ్నలు లీక్ అయ్యాయని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ‘ఒక్క ప్రశ్న విషయంలో అలా జరిగినా కూడా అది మేం నిర్దేశించుకున్న ప్రమాణాలకు విఘాతం కలిగినట్లే. అందుకే మళ్లీ పరీక్ష జరపాలని నిర్ణయించాం’ అని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్‌సింగ్ మీడియాకు వివరించారు. ప్రస్తుత పరిణామంతో దేశంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యావత్ వ్యవస్థ షాక్ కు గురయిందని తప్పు జరిగిందని, దానికి తాము బాధ్యత వహిస్తున్నామని ఆయన చెప్పారు. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని విద్యార్థులనుజీవితాలో చెలగాటమాడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అభిషేక్‌సింగ్ తెలిపారు.
ఏజెన్సీకి అందిన సమాచారాన్ని, దర్యాప్తు నివేదికలతో కలిపి అంచనా వేసినప్పుడు, "ప్రస్తుత పరీక్షా ప్రక్రియను కొనసాగించడానికి అనుమతించలేమని" స్పష్టమైందని ఎన్‌టిఎ పేర్కొంది.
పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ కోసం ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఏజెన్సీ ఇంకా పేర్కొంది. "ఎన్‌టిఎ బ్యూరోకు పూర్తి సహకారం అందిస్తుంది. విచారణకు అవసరమైన అన్ని సామగ్రి, రికార్డులు సాయాన్ని అందిస్తుంది" అని అది పేర్కొంది. "ఈ నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా జాతీయ పరీక్షా విధానం ఆధారపడిన నమ్మకానికి గుర్తింపుగా తీసుకోబడింది."
పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల అభ్యర్థులకు, వారి కుటుంబాలకు "అసౌకర్యం" కలుగుతుందని NTA అంగీకరించింది. కానీ ఈ ప్రక్రియను కొనసాగనివ్వడం వల్ల సంస్థాగత విశ్వసనీయతకు "మరింత పెద్ద శాశ్వత నష్టం" వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది.
మే ‘2026 సైకిల్’ కోసం సమర్పించిన రిజిస్ట్రేషన్ వివరాలు, అభ్యర్థిత్వ రికార్డులు, పరీక్షా కేంద్రాల ప్రాధాన్యతలు కొత్త పరీక్షకు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. "కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అదనపు పరీక్ష రుసుము విధించబడదు" అని ఆ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు ఏజెన్సీ జారీ చేసిన అధికారిక అప్‌డేట్‌లపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.
ఢిల్లీలో నిరసనలు
ఇదిలా ఉండగా, పరీక్ష రద్దు ప్రకటన తర్వాత జాతీయ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. మంగళవారం నాడు, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకు చెందిన కార్యకర్తలు, విద్యార్థి సభ్యులు శాస్త్రి భవన్ సమీపంలో గుమిగూడి, పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అధికారుల నుండి జవాబుదారీతనం కోరారు.
పరీక్షా ప్రక్రియకు సంబంధించిన ఏవైనా అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేయడంతో, విద్యార్థులు, తల్లిదండ్రులలో పెరుగుతున్న ఆగ్రహం మధ్య ఈ ప్రదర్శన జరిగింది.