
కొత్త సేవలు ప్రారంభించిన ‘రాపిడో’
రైల్వే స్టేషన్ లో బగ్గీ సేవలు, బెంగళూర్ లో ప్రయోగాత్మకంగా అమలు
ప్రయాణికులను టూవీలర్ పై గమ్యస్థానాలకు చేర్చే ర్యాపిడో ప్లాట్ ఫాం కొత్తంగా బెంగళూర్ లో ఎలక్ట్రిక్ బగ్గీ సేవలను ప్రారంభించింది. రైల్వే స్టేషన్ లో ఒక్కో సీటుకు రూ. 12 ధరతో వీటిని వినియోగదారులకు అందిస్తోంది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, ఈ బగ్గీ సేవలు నెల రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. వీటిని పైలట్ ప్రాతిపదికన నడుపుతున్నారు. స్టేషన్ నుంచి రాపిడో రైడ్‌ల కోసం బగ్గీ ఛార్జీని రీడీమ్ చేసుకోవచ్చు.
"రైల్వే ప్లాట్‌ఫారాల నుంచి స్టేషన్ బయట ఉన్న పికప్ ప్రాంతానికి రవాణా కోసం ప్రయాణికుల నుంచి ఒక్కో సీటుకు రూ. 12 స్థిర ఛార్జీ వసూలు చేస్తారు. ఈ ఛార్జీని రైల్వే స్టేషన్ అధికారులు నిర్ణయించారు. అయితే, స్టేషన్ నుంచి రాపిడో రైడ్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ రైడ్ ఛార్జీకి బదులుగా బగ్గీ ఛార్జీని రీడీమ్ చేసుకోవచ్చు. తద్వారా వారికి బగ్గీ రైడ్ వాస్తవంగా ఉచితం అవుతుంది" అని ర్యాపిడో పేర్కొన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఈ సేవను "బగ్గీ-టు-బోర్డింగ్: ఎ సీమ్‌లెస్ రైల్వే ఎగ్జిట్ ఇనిషియేటివ్" అని పిలుస్తున్నారు. "ప్రయాణికుల ప్రయాణం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక బగ్గీ సర్వీసులను రైల్వే స్టేషన్‌లో ప్రారంభించినట్లు రాపిడో గర్వంగా ప్రకటిచింది.
ప్రయాణం ప్లాట్‌ఫారమ్‌తో ముగిసిపోదని గుర్తించి, ప్రయాణికులు తమ బగ్గీ కోసం వేచి ఉన్నప్పుడు సేదతీరి, వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా మేము ఒక ప్రత్యేకమైన, పూర్తి ఏసీ సౌకర్యం గల రాపిడో లాంజ్‌ను ఏర్పాటు చేశాము" అని రాపిడో ప్రతినిధి తెలిపారు. "ప్రతి ప్రయాణికుడు తమకు అండగా ఉన్నారని, సురక్షితంగా ఉన్నారని భావించేలా, సామాను, మార్గనిర్దేశంలో సాయం చేయడానికి మా క్షేత్రస్థాయి బృందం ఈ ప్రక్రియ అంతటా అందుబాటులో ఉంటుంది" అని ప్రతినిధి వెల్లడించారు.
Next Story

