ఇక ప్రపంచం చూపంతా అమరావతి క్వాంటమ్ వ్యాలీ వైపే
x
అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఛాన్సెలర్ పీ సత్యనారాయణన్ కూడా ఉన్నారు(ఎడమ)

ఇక ప్రపంచం చూపంతా అమరావతి క్వాంటమ్ వ్యాలీ వైపే

అమెరికా ఆకర్షణ సిలికాన్ వ్యాలీ అయితే, ఇండియా స్పెషాలిటి అమరావతి క్వాంటమ్ వ్యాలి అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


ఇక ప్రపంచమంతా కూడా అమరావతిపే చూడనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమెరికా స్పెషల్ అట్రాక్షన్ సిలికాన్ వ్యాలీ అయితే ఇండియాకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని ఆయన అన్నారు. అమరావతి వేదికగా జరిగిన క్వాంటం రిఫరెన్స్ ఫెసలిటీ ప్రాంరభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక విషయాలు వెల్లడించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీతో భారత్‌ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వయం ఉత్పాదకత భారత్‌కు సరికత్త బలం అవుతుందని వివరించారు. అంతేకాకుండా దేశంతో పాటు ప్రపంచానికి కావాల్సిన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా రానున్న కాలంలో అమరావతిలోనే తయారవుతాయని వివరించారు.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటం కంప్యూటర్లను నిర్మించేందుకు ముందుగానే సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. అదే దిశగా ఇప్పుడు ఈ సిస్టమ్స్ సిద్ధమైనట్లు వెల్లడించారు. దేశానికి మాత్రమే కాక ప్రపంచానికి అవసరమైన క్వాంటం పరికరాలను ఇక్కడే తయారు చేసే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ముంబైలోని TIFR, బెంగళూరులోని IISc, పూణేలోని DRDO వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఈ క్వాంటం టెస్ట్ బెడ్‌లు అభివృద్ధి చెందినట్లు వివరించారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ వ్యవస్థలను ప్రారంభించడం ఒక మైలురాయిగా అభివర్ణించారు.

వ్యూహాత్మక టెక్నాలజీల్లో భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని ఆయన భావించినట్లు తెలిపారు. దేశీయంగా క్వాంటం ఉపకరణాల తయారీ ఆత్మనిర్భర్ విధానంలో కీలక అంశమని పేర్కొన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో డీప్ టెక్‌కు ముఖ్య స్థానం ఇచ్చినట్లు వెల్లడించారు. కృష్ణా నది తీరంలో అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా, కాలుష్య రహితంగా నెట్ జీరో కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నట్లు వివరించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంట్ చట్ట సవరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేసే దిశగా తొలి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నుంచి క్వాంటం వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తిరుపతిలో స్పేస్ సిటీ, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, విశాఖలో మెడ్ టెక్, అనంతపురంలో సెమీకండక్టర్ కేంద్రాలు ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కూడా అభివృద్ధిలో ఉన్నాయని పేర్కొన్నారు.

డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాలు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రాష్ట్రంలో భారీ ప్రాజెక్ట్ చేపడుతోందని వెల్లడించారు. ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రప్రెన్యూర్ ఉండేలా, ప్రతి వెయ్యి మందికి ఒక స్టార్టప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. ఐఐటీ చెన్నై, ఐబీఎం భాగస్వామ్యంతో లక్షలాది మందిని క్వాంటం రంగంలో నిపుణులుగా తయారు చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, డేటా సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సాంకేతికతను అనుసరించడమే కాదు, ఆవిష్కరణల దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఔషధాలు, వ్యవసాయం, రక్షణ, లాజిస్టిక్స్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారే అవకాశముందని, క్లైమేట్ మోడలింగ్ వంటి అంశాల్లో కూడా అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. క్రయోజనిక్స్, ఫ్యాబ్రికేషన్, పరిశోధన రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

Read More
Next Story