అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా
x
రాజీనామా చేసిన ఎంఆర్ విజయ్ భాస్కర్

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా

స్పీకర్ కు రాజీనామా లేఖ సమర్పించిన కరూర్ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్


Click the Play button to hear this message in audio format

అన్నాడీఎంకే పార్టీ నుంచి మరో నేత నిష్క్రమించారు. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంఆర్ విజయ్ భాస్కర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్నికల తరువాత అన్నాడీఎంకే నుంచి నిష్క్రమించిన ఆరో ఎమ్మెల్యే భాస్కర్. పార్టీలో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని, అందుకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలో టీవీకేలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ భాస్కర్ లేదా ఎంఆర్వీ అని పిలిచే ఆయన నేడు స్పీకర్ జేసీడీ ప్రభాకరన్ ను కలిశాడు. తన సొంత చేతిరాతతో కూడిన రాజీనామా లేఖను సెక్రటరీ చేతికి అందించాడు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా..

ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశాడు. ఆయన మొన్నటి ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి వీఆర్ మతియలింగం చేతిలో 2 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన కరూర్ నుంచి గెలవడం వరుసగా మూడోసారి. జయలలిత హయాంలో ఆయన రవాణా శాఖమంత్రిగా పనిచేశారు. అలాగే ఓ పన్నీర్ సెల్వం, ఈపీఎస్ హయాంలోనూ మంత్రిగా సేవలు అందించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే 47 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ బలం 41కి పడిపోయింది. వీరంతా కూడా బలనిరూపణలో విజయ్ కు అనుకూలంగా ఓటు వేశారు. ఇప్పుడు పార్టీ నుంచి వరుసగా వీరు బయటకు వెళ్లిపోతున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు వైద్య వృత్తిలో ఉన్నారు.

టీవీకే పై ఉదయనిధి విమర్శలు..

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఈ పరిణామంపై స్పందించారు. ఇది రాజకీయ వ్యభిచారానికి పరాకాష్టగా అభివర్ణించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆయన ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోబోమని చెప్పారని కానీ ఆయన మాటలను ఆయనే ఉల్లంఘించారని అన్నారు. విజయ్ భాస్కర్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నారని ఆరోపించారు.
తమిళనాడులో వాషింగ్ మెషింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, తమిళనాడు ప్రజలు వీటిని గమనిస్తున్నారని వీరికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

ఏడు స్థానాలు ఖాళీ..

కరూర్ ఎమ్మెల్యే రాజీనామాలో తమిళనాడు అసెంబ్లీలో ఏడు స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఆరు స్థానాలు అన్నాడీఎంకేవి కాగా, ఒకటి చీఫ్ మినిస్టర్ విజయ్ తాను రెండు గెలిచిన ఎమ్మెల్యే స్థానాలలో ఒకదానికి రాజీనామా చేశారు.
Read More
Next Story