మైసూర్ హిల్స్ లో మరో రెండు మృతదేహాలు
x

మైసూర్ హిల్స్ లో మరో రెండు మృతదేహాలు

బెంగళూర్ క్యాబ్ డ్రైవర్ హత్యలో ఇప్పటి వరకూ ఐదు మృతదేహాల లభ్యం, మరో రెండింటి కోసం వెతుకులాట


Click the Play button to hear this message in audio format

బెంగళూర్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్, ఆ మృతదేహాలను ఎక్కడెక్కడో పడవేశాడు. వాటిలో రెండు మృతదేహాలను మైసూర్ లోని చాముండి కొండల్లో పోలీసులు కనుగొన్నారు. వీటితో ఇప్పటి వరకూ మొత్తం ఐదు మృతదేహాలు దొరికాయి.మిగిలిన రెండు మృతదేహాల కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.

దొరికిన మృతదేహాలను శివకుమార్, దివ్యగా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని సెలం జిల్లా యెర్కాడ్ అటవీ ప్రాంతంలో శనివారం క్యాబ్ డ్రైవర్ భార్య, అత్త మృతదేహాలు లభ్యమైన తరువాత ఈ రికవరీ జరిగింది. శుక్రవారం నంది హిల్స్ సమీపంలో పునీత్ అనే ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చనిపోయిన ఏడుగురు గత 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఇందుశేఖర్ రాజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో హత్యలు చేసి మృతదేహాలను కర్ణాటక, తమిళనాడు వ్యాప్తంగా పలు అటవీ ప్రాంతాలలో పడవేశాడు. విచారణ సమయంలో నిందితుడు తాను మృతదేహలను రకరకాల ప్రదేశాలలో పడవేసినట్లు వివరించాడు. దీనితో పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.
నిందితుడు వారిని చంపేముందు వారికి మత్తుమందు ఇచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడుల సమయంలో బాధితులు అరిచే అరుపులు చుట్టుపక్కల వారికి వినపడకుండా ఉండేందుకు టీవీ సౌండ్ భారీగా పెంచి ఉండవచ్చనే కోణంలో విచారణ చేస్తున్నారు.
నవంబర్ 3న శ్రీరాంపుర పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి కనిపించడం లేదనే మిస్సింగ్ కేసు నమోదు అయింది. దానితో పోలీసులు విచారణ చేయగా, హత్యల విషయం వెలుగు చూసింది. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Read More
Next Story