
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కర్ణాటకలో ఆల్ పార్టీ మీటింగ్ పిలుపునిచ్చిన ‘డీకే’
కావేరీ నదీ జలాల వివాదంపై న్యాయ, రాజకీయ వ్యూహం కోసం కసరత్తు
తమిళనాడుకు కావేరీ నదీ జలాలు విడుదల చేయాలనే కావేరీ జల నియంత్రణ కమిటీ(సీడబ్ల్యూఆర్సీ)ఆదేశంతో కర్ణాటక, తమిళనాడులో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. రోజుకు 3500 క్యూసెక్కుల నీటిని, 15 రోజుల పాటు విడుదల చేయమని ఆదేశాలు రావడంతో ఇవి చోటు చేసుకున్నాయి. దీనితో కర్ణాటకలో ఆల్ పార్టీ మీటింగ్ కు సీఎం డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర న్యాయ, రాజకీయ వ్యూహాన్ని రూపొందించేందుకు ఆయన సంకల్పించారు.
ఈ అంశంపై కర్ణాటక వైఖరిని చర్చించేందుకు ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కావేరీ పరీవాహక ప్రాంత కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. జూలై 30న కావేరీ జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కర్ణాటక వ్యాప్తంగా విస్తృత నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని బీజేపీ, రైతు సంఘాలు, కన్నడ అనుకూల బృందాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆగస్టు 3న తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్ జోసెఫ్‌తో జరగాల్సిన తన సమావేశాన్ని శివకుమార్ వాయిదా వేశారు. "మరింత అనుకూలమైన, స్నేహపూర్వక వాతావరణంలో" చర్చలు తర్వాత జరపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై రాష్ట్రం చట్టపరమైన, రాజకీయ ప్రతిస్పందనపై ఒక ఐక్య వైఖరిని రూపొందించడంలో అఖిలపక్ష సమావేశం సాయపడుతుందని కూడా ఆయన అన్నారు.
కర్ణాటక ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే, కొనసాగుతున్న కావేరీ వివాదంలో అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన రాజ్యాంగపరమైన మార్గాలను రాష్ట్రం అనుసరిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
Next Story

