సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన డీకే శివకుమార్
x
డీకే శివకుమార్

సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన డీకే శివకుమార్

హాజరైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య


Click the Play button to hear this message in audio format

తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ శనివారం సాయంత్రం సమావేశపై డీకే శివకుమార్ ను ఎన్నుకుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హజరయ్యారు. విధాన సౌధలో ఈ మీటింగ్ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డీకే పేరును స్వయంగా ప్రతిపాదించగా, మిగిలిన ఎమ్మెల్యేలు అంతా తమ మద్దతును తెలుపారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాల పర్యవేక్షణలో ఇది జరిగింది. సమావేశానికి ముందు ఓ హోటల్ లో శివకుమార్ వేణుగోపాల్, సూర్జేవాలాతో సమావేశం అయ్యారు. కొత్త ముఖ్యమంత్రి జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ జీ సీ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. అయితే కచ్చితమైన సమయం మాత్రం ఇప్పుడు చెప్పలేమన్నారు. ఈ కార్యక్రమం లోక్ భవన్ లోని గ్లాస్ హౌజ్ లో జరుగుతుందని పేర్కొన్నారు.

కేపీసీసీ అధ్యక్షుడు ఎవరూ?

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎన్నిక కానున్న తరుణంలో తదుపరి పీసీసీ అధ్యక్షుడు ఎవరనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంసీ సుధాకర్ మాట్లాడుతూ.. ‘‘హైకమాండ్ ఏదీ నిర్ణయించినా మేము దానిని పాటిస్తాము. ప్రస్తుతం ఆ పదవి ఖాళీ కాలేదు. అయినప్పుడు పార్టీ తరువాత నిర్ణయం తీసుకుంటుంది’’ అన్నారు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సతీశ్ జార్కిహోళీ అందరికంటే ముందువరసలో ఉన్నారు.


Read More
Next Story