సీఎంగా రాజ్యాంగ ప్రతితో ప్రమాణ స్వీకారం చేసిన ‘డీకే శివకుమార్’
x
ప్రమాణ స్వీకారం చేస్తున్న డీకే శివకుమార్

సీఎంగా రాజ్యాంగ ప్రతితో ప్రమాణ స్వీకారం చేసిన ‘డీకే శివకుమార్’

ఆయనతో పాటు 13 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం


Click the Play button to hear this message in audio format

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం లోక్ భవన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో పదవీ, గోప్యతా ప్రమాణం చేయించారు. శివకుమార్ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని, తన గురువు గంగాధర అజ్జయ్య పేరు మీద ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.

శివకుమార్ తో పాటు 13 మంది సహచరులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జీ పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయగా, కే హెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జార్కిహోళీ, కృష్ణ బైరే గౌడ, ప్రియాంక్ ఖర్గే, యూటీ ఖాదర్, ఈశ్వర్ ఖండ్రే, యతీంద్ర సిద్ధరామయ్య, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

హజరైన ఖర్గే, రాహుల్..

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు అగ్ర నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. అలాగే వివిధ మఠాధిపతులు సైతం విచ్చేశారు.
మే 28న సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం 64 ఏళ్ల ఒక్కలిగ వర్గపునాయకుడైన డీకే శివకుమార్ మే 30 సీఎల్పీ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఇంతకుముందు సిద్ధరామయ్య కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.
Read More
Next Story