తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్: సిద్ధరామయ్య
x

తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్: సిద్ధరామయ్య

లోక్ భవన్ కు బయలుదేరిన సీఎం సిద్ధరామయ్య


Click the Play button to hear this message in audio format

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ ఉండబోతున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఈ రోజు ఉదయం తన నివాసంలో జరిగిన అల్ఫాహార సమావేశంలో ఈ నిర్ణయాన్ని సీఎం ప్రకటించారు. ఈ సమావేశానికి డీకే కూడా హాజరయ్యారు.

ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ఫొటోలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు హత్తుకుని ఉన్నారు. మరో ఫొటోలో సిద్ధరామయ్య పాదాలను తాకుతూ డీకే కనిపించారు. సీఎంఓ సమాచారం ప్రకారం..రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు మార్గం సుగమం చేయాలని పార్టీ హైకమాండ్ కోరిన తరువాత ముఖ్యమంత్రి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తన స్వస్థలమైన ఇండోర్ కు వెళ్లిన సిద్దరామయ్య, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసేందుకు ఇంకా అపాయింట్ మెంట్ కోరలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి.
అయితే ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు సీఎం పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారని మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఆయన ప్రస్తుతం లోక్ భవన్ కు బయలుదేరారు. గవర్నర్ లేకపోయినప్పటికీ ఆయన కార్యాలయంలో రాజీనామా లేఖను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read More
Next Story