శివుడిగా డీకే శివకుమార్ చిత్రణ.. కన్నడ ఎడిటర్ పై విమర్శలు
x
డీకే శివకుమార్ ను పరమ శివుడితో పోల్చిన పత్రిక చిత్రం

శివుడిగా డీకే శివకుమార్ చిత్రణ.. కన్నడ ఎడిటర్ పై విమర్శలు

పేపర్ అమ్ముకోవడానికి ఇదో చీప్ ట్రిక్కు అని తలంటిన నెటిజన్లు


Click the Play button to hear this message in audio format

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను శివుడిగా చిత్రీకరిస్తూ ఒక ముఖ చిత్రాన్ని పేపర్ లో ప్రచురించడంతో రాష్ట్రంలో దుమారం చెలరేగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బుధవారం సాయంత్రం 4:05 గంటలకు బెంగళూరులోని లోక్ భవన్‌లో శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆయనతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో కన్నడ వార్తాపత్రిక విశ్వవాణి, ప్రధాన వార్తతో పాటు శివకుమార్‌ను త్రిశూలం, ఢమరుకం పట్టుకున్న శివుడిగా చిత్రీకరించింది. ముఖపత్రంలోని ఈ చిత్రాన్ని ఆ పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ విశ్వేశ్వర్ భట్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు. ఈ పోస్ట్ త్వరగా వైరల్ గా మారింది. దీనితో నెటిజన్లు ఎడిటర్ భట్‌పై దాడి విమర్శల వర్షం కురిపించారు.

'దైవదూషణ'

“ఇది వేషధారణ కాదు. మనోభావాలను గౌరవించండి. మీరు క్షమాపణ చెప్పాలి. మీరు ఒకటి చెబుతారు మరొకటి చేస్తారు. మీ నుంచి, మీ పత్రిక నుండి ఇది ఆశించలేదు,” అని ఒక ఎక్స్ యూజర్ ఆ పోస్టుకు బదులిచ్చారు.
"ఇది దైవదూషణ... కన్నడిగులు దీన్ని ఎలా సాధారణంగా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు" అని ఒక వ్యక్తి రాశారు. “ఇదేనా జర్నలిజమా? అందుకే కన్నడ మీడియాకు ఎక్కడా పలుకుబడి లేదు” అని మరో యూజర్ అన్నారు.
ఇంకో పోస్టులో “దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న మీలాంటి సీనియర్ నుంచి ఇలాంటి ముఖపత్రం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. మీరు సిగ్గుపడాలి. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన వ్యక్తిని దేవుడితో పోలుస్తూ ఇలా చిత్రీకరించడం పూర్తిగా ఖండనీయం. కళాత్మకత ముసుగులో మన దేవుళ్లను ఈ విధంగా అవమానించడం ఆమోదయోగ్యం కాదు.
ఒక్క క్షణం ఆత్మపరిశీలన చేసుకోండి.” వార్తాపత్రిక కాపీలు ఎక్కువగా అమ్ముకోవడానికి ఇది ఒక “స్టంట్” అని ఒక వ్యక్తి పేర్కొన్నారు. "ఇది మరిన్ని వార్తాపత్రికలు అమ్ముకోవడానికి చేసే ఒక రకమైన ఎగతాళి లేదా ప్రచార ఎత్తుగడలా ఉంది. మొత్తం మీద ఇది మంచి అభిరుచికి తగినది కాదు."
"ఏదో ఒక రాజకీయ నాయకుడిని సనాతన దేవతతో ముడిపెట్టడం చాలా తప్పు. ఇది చాలా నీచమైన అభిరుచి, మీ వార్తాపత్రిక చదివే కోట్లాది హిందువులను బాధిస్తుంది. దయచేసి క్షమాపణ చెప్పి, కొంతైనా పరువు నిలుపుకోండి" అని మరో వినియోగదారు అన్నారు.
Read More
Next Story