
ఉదయనిధి స్టాలిన్
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్..
నటి త్రిషపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు.. కేసు నమోదు
కావేరీ నీటి సమస్యపై జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా సినీ నటీ త్రిషా కృష్ణన్ పై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను తంజావూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను చెన్నైలోని తన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళలపై ఉదయనిధి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీవీకే సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా తంజావూర్ తూర్పు పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయింది. చెన్నైలోని నీలన్ కరైలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు మోహరించడంతో పోలీసులకు, డీఎంకే కార్యకర్తకలకు మధ్య ఘర్షణ చెలరేగింది.
కావేరీ నది సమస్యపై నిన్న దక్షిణ తమిళనాడులో జరిగిన నిరసనల సందర్భంగా రాయలేని భాషలో ఉదయనిధి స్టాలిన్, నటి త్రిషపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటితో మహిళల పరువుతీస్తున్నారని తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ విమర్శలు గుప్పించారు.ఈ పరిణామం ఇప్పుడు తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
Next Story

