
భాగ్యరాజ్ కు నివాళులర్పిస్తున్న సీఎం విజయ్
‘భాగ్యరాజ్’ నేత్రాలను దానం చేసిన కుటుంబం
ప్రశంసించిన తమిళిసై సౌందరరాజన్
తమిళ దర్శక, నిర్మాత, నటుడు కే. భాగ్యరాజ్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు చిత్రపరిశ్రమ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నతరుణంలో ఆయన కళ్లను దానం చేసినందుకు రాజకీయ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. దివంగత నటుడికి నివాళులు అర్పిస్తున్న తరుణంలో తాను కళ్లను దానం చేసిన విషయాన్ని విన్నానని ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.
పొగడ్తలు సరిపోవు..
ఒక వ్యక్తి చనిపోయిన తరువాత కూడా మరో వ్యక్తికి చూపునివ్వాలనే వారి ఆశయం ఎంత పొగిడిన తక్కువే అని బీజేపీ నాయకురాలు అన్నారు. ప్రముఖులు ఇలాంటి పనులు చేసి మార్గదర్శకంగా నిలిస్తే సామాన్యులు కూడా ఈ దారిలో నడిచే అవకాశం ఉంటుందని అన్నారు.
దేశంలో ప్రస్తుతం కళ్లను దానం చేసే సంప్రదాయం అంతగా ప్రాచుర్యం పొందలేదని ఆమె అన్నారు. ‘‘భారత్ లో ఏటా లక్ష నుంచి రెండు లక్షల కార్నియాలు అవసరం కాగా, అవి కేవలం 50 వేల వరకూ మాత్రమే లభిస్తున్నాయని’’ తమిళిసై అన్నారు.
కంటి ఆసుపత్రికి సమాచారం..
తమిళ వార్తా పత్రికల సమాచారం ప్రకారం.. భాగ్యరాజ్ కొన్ని సంవత్సరాల క్రితమే తన కళ్లను దానం చేయడానికి అంగీకరించారు. ఆయన మరణం తరువాత కుటుంబం అందుకు అంగీకరించి, ప్రస్తుతం కంటి ఆసుపత్రికి సమాచారం అందించింది. ప్రజలు సందర్శనార్థం ఆయన పార్థీవ దేహాన్ని ఉంచిన చెన్నైలోని నంగంబాక్కంలోని ఆయన ఇంటికి వైద్యుల బృందం చేరుకుని కార్నియాలను సేకరించింది.
స్క్రీన్ ప్లే కింగ్ గా పేరు పొంది, దశాబ్ధాల పాటు కోలీవుడ్ ప్రేక్షకులు ఉర్రూతలూగించిన కే. భాగ్యరాజ్ శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 73, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరన్ విజయ్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
Next Story

