సీటు దొరికితే ఉద్యోగం గ్యారెంటీ!
x

సీటు దొరికితే ఉద్యోగం గ్యారెంటీ!

సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్


ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య యుద్ధాలు, ఘర్షణల మూలంగా ఉద్యోగ మార్కెట్‌ కుదేలవుతోంది. ఉపాధి అవకాశాలు మూసుకుపోవడం, చదువుకు తగ్గ ఉద్యోగాలు దక్కకపోవడం యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

"2027 నాటికి 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు ప్రపంచంలో అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో 8.3 కోట్ల ఉద్యోగాలు మాయమవుతాయని," ఈ మధ్య ప్రపంచ ఆర్థిక నివేదిక అంచనా వేసింది.

దేశంలో ఏటా సుమారు కోటి మందికి పైగా యువతీ యువకులు డిగ్రీలు చేతపట్టుకుని మార్కెట్లోకి అడుగు పెడుతున్నా వారికి తగిన ఉద్యోగాలు దొరకడం లేదు. "ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో 83 శాతం, బిజినెస్‌ గ్రాడ్యుయేట్లలో 46 శాతం మందికి ఉపాధి లభించడం కష్టంగా ఉందని," లింక్డ్‌ఇన్‌ అధ్యయనంలో తేలింది. "ఉద్యోగాలు సంపాదించిన వారిలోనూ కేవలం 8.25 శాతం మందికే చదువుకు తగ్గ పనులు దక్కుతున్నాయనేది," ఎకనామిక్‌ సర్వే సారాంశం.

చాలా మందికి "ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉండడం లేదనేది నిజం. భారతీయ యువతలో దాదాపు సగం మందికి వివిధ రంగాలకు అవసరమైన కనీస నైపుణ్యాలు కూడా లేవని," యునెస్కో తన నివేదికలో పేర్కొన్నది.

దేశంలో విభిన్న రంగాల్లో పది కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా వాటిని చేజిక్కించుకోగలిగే నైపుణ్యం ఉన్న యువత కరువైంది. స్కిల్స్ లేని కారణంగా ఫుడ్‌ డెలివరీ వంటి గిగ్‌ వర్కర్లలో ముప్పై శాతం గ్రాడ్యుయేట్లే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

"వివిధ కంపెనీలు క్యాంప‌స్ నియామకాల్లో నైపుణ్యానికే పెద్దపీట వేస్తున్నాయి. వీటితో పోలిస్తే విద్యార్థులు పరీక్షల్లో సాధించిన మార్కులు, చేసిన ప్రాజెక్టులు, సిఫారసులను అవి పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు," అని మ‌ల్లేప‌ల్లి ఐటిఐ ప్రిన్సిప‌ల్ శైల‌జా ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

ఈ పోటీ ప్ర‌పంచంలో "తెలంగాణా యువతకు నమ్మకమైన భవిష్యత్తును అందించడం కోసం మ‌ల్లేప‌ల్లి ఐటిఐ స్కిల్స్‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తోంది. "దేశంతో పాటు, విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న యువతకు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇస్తున్నాం. జర్మనీ, జపాన్‌ దేశాలకు ఎంపికైన వారికి ఆయా దేశాల భాషలను నేర్పించి పంపిస్తున్నామ‌ని," శైల‌జా చెప్పారు.


"మ‌ల్లేప‌ల్లి ఐటిఐలో శిక్ష‌ణ పొందితే ఉద్యోగం గ్యారెంటీ. ఎందుకంటే ఇక్క‌డ ఫుల్ టైం ప్లేస్‌మెంట్ సెల్ ఉంది. 200కు పైగా పెద్ద కంపెనీల‌తో ఒప్పందం వుంది. ఆ కంపెనీల‌కు కావాల్సిన మ్యాన్‌ప‌వ‌ర్‌ను మ‌ల్లేప‌ల్లి ఐటిఐ అందిస్తోంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా క్యాంపస్ ఇంటర్వ్యూలు జ‌రుగుతూనే ఉంటాయి. ఈ ఐటిఐ 52 యూనిట్లలో 32 కోర్సుల్లో వృత్తి శిక్షణను అందిస్తోంది. 1250 మంది శిక్షణ పొంద‌డానికి అవ‌కాశం ఉంది. ఇప్పటి వరకు ఈ ఐటిఐ నుండి సుమారు ల‌క్ష‌కు పైగా శిక్ష‌ణ పొందార‌ని," ప్రిన్సిప‌ల్ శైల‌జా ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. 22.09 ఎకరాల సువిశాల స్థ‌లంలో 1954 సంవత్సరంలో మల్లేపల్లి ఐటిఐ (ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ) ప్రారంభం అయింది.

అవగాహన ఒప్పందాలుః

అభ్య‌ర్థుల స్కిల్స్ మెరుగుప‌ర్చ‌డానికి మ‌ల్లేప‌ల్లి ఐటిఐ 12 కంపెనీల‌తో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఈ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఫండింగ్ చేసి అవ‌స‌ర‌మైన స‌హ‌కారం అందిస్తున్నాయి. 1. మెస్సర్స్ థైసెన్‌క్రుప్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2. మెస్సర్స్ జాన్సన్ లిఫ్ట్స్ & ఎస్కలేటర్స్ లిమిటెడ్, 3. మెస్సర్స్ ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్, 4. మెస్సర్స్ TNS లిమిటెడ్5. మెస్సర్స్ ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 6. “ఇగ్నైట్” (అధిక నాణ్యత శిక్షణ మరియు సాంకేతిక విద్యకు మద్దతు ఇవ్వడానికి ఇండో జర్మన్ ఇనిషియేటివ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), 7. మెస్సర్స్ ASACO లిమిటెడ్, 8. మెస్సర్స్ మల్లికా KIA లిమిటెడ్, 9. మెస్సర్స్ సాయి మోటార్స్, 10. మెస్సర్స్ పవన్ మోటార్స్, 11. మెస్సర్స్ మారుతి సుజుకి లిమిటెడ్, 12. మెస్సర్స్ NBV కమ్యూనిటీ ప్రైవేట్ లిమిటెడ్ & ఫిక్స్క్స్ కో., లిమిటెడ్, టోక్యో, జపాన్.

మ‌ల్లేప‌ల్లి ITI తెలంగాణలో మోడల్ ITIగా ఎంపికైంది, దీనికి రూ. 5 కోట్ల నిధులు వచ్చాయి. కొత్త భవనం నిర్మాణం కోసం ఉపయోగించిన ఈ నిధులు, 2 కొత్త ట్రేడ్లు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (స్మార్ట్ సిటీ) & సోలార్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) ను ప్రవేశపెట్టాయి. కొన్ని ట్రేడ్లు తాజా సాధనాలు, పరికరాలు, యంత్రాలతో అప్‌గ్రేడ్ చేశారు. ఇటీవల, మోడల్ ITI పథకం (కేంద్ర ప్రాయోజిత పథకాలు) (CSS) కింద రెండు కొత్త ట్రేడ్‌లను ప్రవేశపెట్టారు.SOLAR టెక్నీషియన్ (ఎలక్ట్రికల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (స్మార్ట్ సిటీ) అనుబంధ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.

Read More
Next Story