‘‘మేకెదాటు ప్రాజెక్ట్ కు పక్క రాష్ట్రాల అనుమతి అవసరం లేదు’’
x
కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ప్రాజెక్ట్ స్థలం

‘‘మేకెదాటు ప్రాజెక్ట్ కు పక్క రాష్ట్రాల అనుమతి అవసరం లేదు’’

పార్లమెంట్ లో స్పష్టం చేసిన కేంద్రం


Click the Play button to hear this message in audio format

కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ప్రాజెక్ట్ పై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ కు ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి అవసరం లేదని సోమవారం రాత్రి పొద్దుపోయాక పేర్కొంది. రాజ్యసభలో తమిళనాడు ఎంపీ డాక్టర్ అన్భుమణి రాందాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి రాజ్ శాఖ సహాయ మంత్రి భూషణ్ చౌదరీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

అస్పష్టత ముగిసింది..

ప్రాజెక్ట్ ను రూపొందించేటప్పుడూ లేదా అమలు చేసేటప్పుడూ కర్ణాటక పొరుగు రాష్ట్రాల ఆమోదం పొందవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు నిర్దేశిస్తోందని ఆ స్పందనలో పేర్కొంది. ఫలితంగా కావేరీ నదీ జలాల వినియోగంపై కర్ణాటకకు సంపూర్ణ అధికారం లభించినట్లు అయింది.
మేకెదాటు ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్లే ముందు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరీల సమ్మతిని పొందిందా లేదా అని డాక్టర్ రామదాస్ తెలుసుకోవాలని కోరారు. దీనికి ప్రతిస్పందనగా ఏదైనా నిర్మాణం చేపట్టాలని ఇతర రాష్ట్రాల అనుమతి తప్పనిసరి కాదని జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విషయం ప్రతిపాదిత ప్రాజెక్ట్ కు దీర్ఘకాలంగా నెలకొన్న సాంకేతికత సందిగ్థతకు ముగింపు పలికినట్లు భావిస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు..

కావేరీ జలాల పంపిణీ వివాదంపై 2018 ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు కర్ణాటకకు ప్రధాన మైలురాయిగా చెప్పవచ్చు. ఈ తీర్పు అంతరాష్ట్ర నదీ జలాల వినియోగానికి సంబంధించిన స్పష్టమైన సూత్రాలు నిర్దేశించింది.
కేంద్రమంత్రి ప్రకారం.. నదికీ అడ్డంగా ఎలాంటి నిర్మాణం చేపట్టే ముందు కర్ణాటక తప్పనిసరిగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరీ నుంచి వస్తున్న ముందస్తు అనుమతి లేదా సమ్మతి పొందాలని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదు. కేంద్ర ఇచ్చిన ఈ వివరణను కర్ణాటక వైఖరికి లభించిన ఒక ముఖ్యమైన చట్టపరమైన మద్దతుగా పరిగణిస్తున్నారు.

మేకెదాటు ప్రాజెక్ట్..

కర్ణాటక ప్రభుత్వం 2019 లో మేకెదాటు ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక ను కేంద్ర జలసంఘం సమర్పించింది. కొన్ని సాంకేతిక సమస్యలతో పాటు తమిళనాడు లేవనెత్తిన అభ్యంతరాలను పేర్కొంటూ కమిషన్ ఆ డీపీఆర్ ను వెనక్కి పంపింది.
సీడబ్యూసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కావేరీ జల వివాదాలను ట్రిబ్యూనల్ తీర్పు, కమిషన్ ప్రస్తుత మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించిన డీపీఆర్ ను సిద్దం చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఏ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లో నైనా మాదిరిగానే పర్యావరణ అనుమతి, అటవీ అనుమతి, సాంకేతిక ఆమోదాలు తప్పనిసరిగా అవసరం.
సవరించిన నివేదికను సమర్పించే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. మేకెదాటు ఆనకట్ట నిర్మాణం వల్ల రాష్ట్రంలోకి నీటి ప్రవాహం తగ్గుతుందని తమిళనాడు వాదన. అయితే ఈ ప్రాజెక్ట్ నీటిని మళ్లించడానికి కాకుండా నిల్వ చేయడానికి ఉద్దేశించినదని, ఈ వ్యత్యాసమే కీలకమని కర్ణాటక నిరంతరం వాదిస్తూ వస్తోంది.
కావేరీ నదీ జల వివాదం, మేకెదాటు ప్రాజెక్ట్ పై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు కీలక చర్చల నిమిత్తం తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ ఆగష్టు మొదటి వారంలో బెంగళూర్ పర్యటనకు వెళ్లనున్నారు.
Read More
Next Story