కర్ణాటకలో తల్లి, ఐదుగురు పిల్లల ఆత్మహత్య
x

కర్ణాటకలో తల్లి, ఐదుగురు పిల్లల ఆత్మహత్య

కుటుంబ వివాదాలే కారణం


Click the Play button to hear this message in audio format

కర్ణాటకలోని విజయపురలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక సరస్సులో భూత్నాల్ సరస్సులో ఒక మహిళ, ఆమె ఐదుగురు పిల్లల మృతదేహాలు దొరికాయి. మరణాలకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియదు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సరస్సు ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.

మహిళలు, పిల్లలు మిస్సింగ్..

మృతురాలు శోభ(35), భర్త సోమవారం విజయపుర రూరల్ పోలీస్ స్టేషన్ లో తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన ఒక రోజు తరువాత ఈ విషయం తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇంటిలో జరిగే గొడవల కారణంగా బాధితురాలు తన పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని మృతురాలి భర్త మల్లికార్జున్ జలగేరీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శోభ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నలుగురు పిల్లలతో ఇంటి నుంచి బయలుదేరీ, ఆ తరువాత వినికిడి లోపం ఉన్న తన చిన్న బిడ్డను తీసుకుని హాస్టల్ వెళ్లిందని పోలీసులు తెలిపారు. అయితే ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్లిపోవడంతోనే ఆమె ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు ఫలించలేదు.
‘‘తదనంతరం వారి ఆచూకీ కనుగోనేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ వారు తమ మొబైల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలి వెళ్లడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు’’ అని పోలీస్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నింబర్గిన్ విలేకరులతో అన్నారు.

మార్చురీకి తరలింపు..

భూత్నాల్ సరస్సుకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారని అనుమానాలు ఉన్నాయి. అయితే ఫోరెన్సిక్, ఎఫ్ఎస్ఎల్, పోస్ట్ మార్టం నివేదికలు అందిన తరువాత అసలు పరిస్థితులు తెలుస్తాయి’’ అని ఎస్పీ తెలిపారు.
బుధవారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో సరస్సులో ఆరు మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారని ఆయన తెలిపారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. వారి వయస్సు 15 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉందని ఆయన పేర్కొన్నారు.
గాలి, అలల కారణంగా మృతదేహాలు సరస్సు ఒక వైపు నుంచి మరో వైపుకు కొట్టుకుపోయాయి. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని నింబర్గి తెలిపారు. ‘‘మేము దీనిపై విచారణ జరుపుతాము. పోస్ట్ మార్టం నివేదిక ముఖ్యం. ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా ముఖ్యమైనదే.
మేము కుటుంబ సభ్యులతో, బంధువులతో కూడా మాట్లాడతాము. కాబట్టి విచారణలో ఏం తెలుతుందో చూస్తామని మహిళ భర్త గురించి అడిగినప్పుడూ ఆయన అన్నారు. అతను వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం పరీక్ష కోసం బీఎల్డీఈ ఆస్పత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Read More
Next Story