కర్ణాటకలో నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న ఎన్డీఏ
x

కర్ణాటకలో నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న ఎన్డీఏ

కంగుతిన్న అధికార కాంగ్రెస్ పార్టీ


Click the Play button to hear this message in audio format

కర్ణాటక లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు షాక్ తగిలింది. తాజాగా వెలువడిన శాసనమండలి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, జేడీఎస్ నేతృత్వంలోని ఎన్డీఏకుకు భారీ ఊరట లభించింది. పోలింగ్ జరిగిన నాలుగు స్థానాల్లో ఎన్డీఏ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో బీజేపీ మూడు స్థానాలు, జేడీ(ఎస్) ఒకటి గెలుచుకుంది.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నాలుగు సీట్లనూ కోల్పోవడం ఒక తీవ్రమైన రాజకీయ ఎదురుదెబ్బ. ఈ ఫలితాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడిందని గానీ, 75 మంది సభ్యులున్న శాసనమండలిలో దాని బలం నాటకీయంగా మారిపోయిందని గానీ అర్థం కాదు. పరిమితమైన, ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఓటర్లు ఉన్న రెండు గ్రాడ్యుయేట్లు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఈ ఎన్నికలు జరిగాయి.

కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలు...

కాంగ్రెస్ కు రాజకీయంగా అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ఈ ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ ఇప్పటికే అంతర్గతంగా విభేదాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి డికే శివకుమార్ వర్గాల మధ్య సిద్దరామయ్య ప్రమేయం ఉన్నట్లు ఆరోపించబడిన స్టింగ్ ఆపరేషన్ పై వివాదం పార్టీ రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది.
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కూటమి భారీ విజయం సాధించింది. రెండు పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేశారు. బీజేపీ, జేడీఎస్ సీనియర్ నాయకులు సంయుక్త సమావేశాలు నిర్వహించి, బాధ్యతలు పంచుకుని కలిసి ప్రచారం చేశారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కూటమి మెరుగైన సమన్వయ సాధించినట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ల మధ్య ఓట్ల బదిలీ తరుచుగా ఒక సవాల్ గా ఉండేది. కనీసం ఈ నాలుగు నియోజకవర్గాలలోనైనా, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈ కూటమి తన మద్దతుదారులను ఏకం చేయగలిగిందని ఫలితాలు సూచిస్తున్నాయి.

ఫలితాలు...

బెంగళూర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఇక్కడ మంచి ఉదాహారణ. జేడీ(ఎస్) అభ్యర్థి ఏపీ రంగనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి పుట్టన్న ను 908 ఓట్ల తేడాతో ఓడించారు. రంగనాథ్ కు 10,810 ఓట్లు రాగా, పుట్టన్న కు 9,902 ఓట్లు వచ్చాయి. పుట్టన్న ఆ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన బలమైన అభ్యర్థి.. ఆయన ఆ స్థానాన్ని ఐదుసార్లు గెలుచుకున్నారు. అందువల్ల ఆయన ఓటమి జేడీఎస్, బీజేపీ కూటమికి ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపుతోంది. వారి ఉమ్మడి ఓట్లు ఒక బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించగలవు.
మిగిలిన మూడు స్థానాలను కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలుచుకుంది. పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎస్. వి. శంకనూర్, కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ లింబికాయ్ ను 9,323 ఓట్ల తేడాతో ఓడించారు. ఈశాన్య ఉపాధ్యాయుల నియోజకవర్గంలో శశిల్ జి. నమోషీ 3,297 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆగ్నేయ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేఎం సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి శశి హుళికుంటే మఠాన్ని 23,098 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు.
ఈ ఫలితాలు కాంగ్రెస్ కు మరో ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తున్నాయి. ఓటర్లలోని కొన్ని వర్గాలలో పార్టీ తన సంప్రదాయ మద్దతును కోల్పోయిందా? సిద్దరామయ్య తో ముడిపడి ఉన్న అహిందా రాజకీయాల కారణంగా ఇది ముఖ్యమైనది. అహింద మైనారిటీలు, వెనకబడిన తరగతులను, దళితులను ఏకం చేస్తుంది. ఎమ్మెల్సీ ఓటర్లు, విస్తృత అసెంబ్లీ ఓటర్లు ఒకేలా ఉండరు. కాబట్టి ఈ ఫలితాలను మొత్తం అహింద ఓటర్లలో వచ్చిన మార్పుతో పోల్చి చూడలేము.
ప్రస్తుత రాజకీయ వాతావరణానికి సిద్దరామయ్య స్టింగ్ ఆపరేషన్ వివాదం కూడా ఒక పాత్ర పోషించి ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆ వివాదమే కాంగ్రెస్ ఓటమి నేరుగా కారణమైందని చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ ఇప్పటికే పార్టీలో అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ సమయంలోనే పార్టీకి మరో రాజకీయ సవాల్ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఎదురైంది.

ఎన్డీఏ వ్యూహం..

ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలవడం వెనక సిద్దరామయ్య పాత్ర ఉందా అనే ప్రశ్న అందరిని వేధిస్తోంది. ఆయనకు అహిందా వర్గాలలో మంచి ఆదరణ ఉంది. ఆయన కూడా ప్రచారానికి వచ్చి ఉంటే పార్టీకి మరింత బలం చేకూరి ఉండేదా లేక స్టింగ్ ఆపరేషన్ వివాదం వల్ల అహిందా వర్గాలలో గందరగోళం సృష్టించి పార్టీకి అదనపు ప్రతికూలతగా మారిందా అన్నదే ప్రశ్న.
ఈ ఫలితాలు శివకుమార్, కాంగ్రెస్ సంస్థపై కూడా దృష్టిని కేంద్రీకరించాయి. శివకుమార్, ఇతర సీనియర్ నాయకులు ప్రచారం చేసినప్పటికీ, సమన్వయంతో ప్రచారం చేసిన బీజేపీ, జేడీఎస్ కూటమితో పోలిస్తే పార్టీలో ఐక్యత తక్కువగా అనిపించింది.
సిద్దరామయ్య, శివకుమార్ మధ్య సంబంధాల గురించిన ప్రశ్న కూడా ఉంది. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థపై ప్రభావం చూపిస్తే హోరాహోరీగా సాగే ఎన్నికలలో కాంగ్రెస్ పోరాడటం కష్టతరం కావచ్చు. దీనికి విరుద్దంగా బీజేపీ, జేడీఎస్ కాంగ్రెస్ ను ఓడించడంపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు కనిపించాయి. వారి ఉమ్మడి ప్రచారం ఎన్డీఏ కు ఐక్యతా సందేశాన్ని స్పష్టంగా ఇచ్చింది.

క్షేత్ర స్థాయి ప్రచారం...

ప్రారంభం నుంచే బీజేపీ, జేడీఎస్ నాయకులు సంయుక్త సమావేశాలు నిర్వహించి ఐక్యత సందేశాన్ని స్పష్టంగా పంపారు. కేంద్రమంత్రులు కుమారస్వామి, వి సోమన్న, శోభా కరంద్లాజే రాష్ట్ర బీజేపీ, జేడీఎస్ నాయకులతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. అనంతరం నాయకులు కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రహ్లాద్ జోషి, కుమార స్వామితో సహ సీనియర్ నాయకులు శాసన మండలి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆ తరువాత రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు కూడా ప్రచారంలో పాలుపంచుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి నాయకులకు బాధ్యతలు అప్పగించారు. రెండు పార్టీల మధ్య ఎక్కడా అసంతృప్త బేధాలు తలెత్తకుండా నాయకులు చూసుకున్నారు. కాంగ్రెస్ లో అలా జరగలేదు.

అసెంబ్లీ ఎన్నికల ముందు...

స్టింగ్ ఆపరేషన్ విషయంలో కాంగ్రెస్ లో సిద్దరామయ్యపై జరిగిన కుట్ర ఆరోపణల వివాదం ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చిందని అంటున్నారు. దీనివల్ల వెనకబడిన తరగతుల ఓటర్ల నుంచి ఎక్కువ ఓట్లు ఎన్డీఏ వైపుకు మరలాయి.
ఎమ్మెల్సీ ఫలితాలను 2028 అసెంబ్లీ ఎన్నికలకు సూచనగా పరిగణించలేము. గ్రాడ్యూయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఓటర్లు తక్కువగా, భిన్నంగా ఉంటారు. అయినప్పటికీ ఈ ఫలితాలు రాజకీయంగా చాలా ముఖ్యమైనవి. బీజేపీ, జేడీఎస్ లకు నాలుగు స్థానాలు దక్కడం మామూలు విషయం కాదు. ఇది కాంగ్రెస్ కు ఒక హెచ్చరిక.
అధికార పార్టీకి ఎదురవుతున్న పెద్ద ప్రశ్న కేవలం నాలుగు ఎమ్మెల్సీ సీట్లు ఎందుకు కోల్పోయిందనేది పెద్ద ప్రశ్న కాదు. ఇది ఓటర్ల మనోభావాల మార్పుకు నాంది పలికిందా.. సంప్రదాయ కాంగ్రెస్ రాజకీయ, సామాజిక మద్దతుదారులలో స్పష్టంగా మార్పు వచ్చిందా? ఇది కర్ణాటక రాజకీయాలలో పెద్ద చర్చను లేవదీసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ తన రాజకీయ ఆధిపత్యాన్ని కోల్పోవడం ప్రారంభించిందా? లేదా ఎన్డీఏ అనుసరించిన వ్యూహం విజయవంతమైందా?
Read More
Next Story