‘భారత రత్న’ సీఎన్ఆర్ రావుకు నోటీసు ఇవ్వలేదు: ఎన్నికల సంఘం
x

‘భారత రత్న’ సీఎన్ఆర్ రావుకు నోటీసు ఇవ్వలేదు: ఎన్నికల సంఘం

పేరులో తప్పులు ఉన్నాయని గుర్తింపు, అయితే ఆయన మీద గౌరవంతో ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్న కర్ణాటక ఎన్నికల సంఘం అధికారులు


Click the Play button to hear this message in audio format

కర్ణాటక లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ సవరణ జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న సీఎన్ఆర్ రావుకు నోటీస్ అందించినట్లు వస్తున్న వార్తలను ఎన్నికల సంఘం ఖండించింది. ఆయన పేరు లో అదనంగా ఒక ‘ఎఫ్’ ఉండటమే దీనికి కారణమని వార్తలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల సంఘం స్పందించింది.

ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇదే విషయంపై సీఎన్ఆర్ రావు కార్యాలయం కూడా స్పందించింది. తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో నోటీస్ ఉండవచ్చని ఆ కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు.

నోటీస్ ఇవ్వలేదు..

భారత రత్న సీఎన్ఆర్ రావుకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని, ప్రస్తుత ఓటర్ల జాబితాలో మాత్రం రావు పేరులో వ్యత్యాసం మాత్రం ఉందని పేర్కొన్నారు. అయితే ఆయన హోదాను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి నోటీసులు అందించలేదని తెలిపారు.
‘‘ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం.. గౌరవరత్న భారత రత్న పురస్కార గ్రహీత ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు గారు 157, మల్లేశ్వరం శాసనసభ నియోజకవర్గంలోని పార్ట్ నెంబర్ 59 నుంచి ఓటర్ గా ఉన్నారు. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు సన్నాఫ్ నాగేశ్ రావ్. హెచ్ అని ఉంది.. కానీ 2002 ఓటర్ల జాబితాలో మాత్రం తండ్రి హెచ్ నాగేశ్ గా ఉంది’’ అని అధికారి పేర్కొన్నారు. బీపీఓలు ఆయన గురించి తెలుసుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, దాన్ని సరిచేసి తుది ఆమోదం కోసం రికార్డును సరిచేశారని సంబంధిత అధికారులు తెలిపారు.

విచారణకు రావాలి...

నోటీస్ ప్రకారం.. సమస్యను పరిష్కరించుకోవడానికి బెంగళూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) సమీపంలో ఉన్న మల్లేశ్వరంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని రావును ఆదేశించినట్లు ఐఏఎన్ఎస్ నివేదించింది. నోటీస్ అందుకున్న వ్యక్తికి మాత్రమే విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఉంది.
ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు గారి ఎన్నికల రికార్డులలోని సెల్ఫ్ మిస్ మ్యాచ్ సమస్య 2002 నాటి ఓటర్ల జాబితాలోని ఆయన వివరాలకు ప్రస్తుత ఓటర్ల జాబితాకు మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించినది.

సెల్ఫ్ మిస్ మ్యాచ్ ఎలా...

ఈ ప్రక్రియ ప్రకారం.. 2002 ఓటర్ల జాబితాలో కూడా ఉన్న ఓటర్లు సర్ గణన ఫారమ్ ను నింపేటప్పుడూ ఆ జాబితాలోని తన వివరాలను ఉపయోగిస్తారు. ఆ వివరాలు ప్రస్తుత ఓటర్ల జాబితాలోని వ్యక్తి వివరాలతో సరిపోలనప్పుడూ స్వీయ అసమతుల్యత తలెత్తుతుంది.
జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసెర్చ్ లోని రావు పరిచయస్తులు జాతీయ పత్రికకు తెలిపారు. రావు ఫోన్ ను చాలా అరుదుగా ఉపయోగిస్తారు. ఫోన్లు, కంప్యూటర్లు తన ఏకాగ్రతను దెబ్బతీస్తాయని భావించడం వల్ల ఆయన అరుదుగా కాల్స్ చేస్తారు.

సీఎన్ఆర్ రావు శాస్త్రీయ వృత్తి...

ఘన స్థితి, నిర్మాణ రసాయన శాస్త్రంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన రావు, నోబెల్ బహుమతి మినహా తన రంగంలో సాధ్యమైన దాదాపు అన్ని ప్రధాన పురస్కారాలను అందుకున్న శాస్త్రవేత్తగా పరిగణించబడతారు.
రావు ఇందిరాగాంధీకి శాస్త్రీయ సలహ మండలిలో సభ్యుడిగా ఉన్నారు. తరువాత రాజీవ్ గాంధీ, హెచ్ డీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ ఇలా నలుగురు ప్రధానమంత్రులకు సలహ మండళ్లకు అధ్యక్షత వహించారు. ఆయన సేవలు బెంగళూర్ కు కూడా విస్తరించాయి. రావు ఐఐఎస్సీకి అధిపతిగా వ్యవహరించి, జక్కూర్ లో జేఎన్సీఎఎస్ ఆర్ ను స్థాపించి, దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పద్మ విభూషణ్, పద్మ శ్రీ, కర్ణాటక రత్నలతో పాటు అనేక ఇతర పురస్కారాలతో సహ పలు ప్రధాన గౌరవాలను అందుకున్నారు.


Read More
Next Story