
కర్ణాటక: పాన్ మసాలాలపై ఏడాది పాటు నిషేధం
ప్రజా ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం
పొగాకు, గుట్కా వంటి పాన్ మసాలాల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా వంటి వాటిపై కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆహర భధ్రతా కమిషనర్ కార్యాలయం ప్రకటించిన ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వస్తుంది.
నిషేధం ఉత్తర్వులు..
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం- 2026 పాటు ఆహార భద్రత, ప్రమాణాల నిషేధం చట్టం 2011 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తారు. బెంగళూర్ లోని ఆహార భద్రత, ఔషధ పరిపాలన కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషణ్ ప్రకారం.. పొగాకు, నికోటిన్ ఉన్న అన్ని రకాల గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. బ్రాండింగ్, ఉత్పత్తి వివరణతో సంబంధం లేకుండా లేదా వస్తువుల ప్యాకేజీ చేసి లేదా ప్యాకేజీ కనపడకుండా చేసిన ఈ నిషేధం వర్తిస్తుంది.
విస్తృత పరిధి..
వినియోగదారులు ఉపయోగించి ముందు వాటిని కలిపి వాడేలా రూపొందించిన ఉత్పత్తులపై కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాటి ప్యాకేజింగ్, అమ్మకం, పంపిణీ కలపడాన్ని సమర్థవంతంగా ప్రొత్సహించే విధంగా ఉన్నప్పుడూ వేర్వేరు భాగాలుగా అమ్మే వస్తువులను నిషేధం విధిస్తుంది.
నోటిఫికేషన్ ప్రకారం.. పొగాకు లేదా నికోటిన్ గుట్కా, పాన్ మసాలాలతో నిండి ఉన్న కంటైనర్లు, ప్యాకేజీలు ఇతర ప్యాకేజీ రూపంలో ప్యాక్ చేయబడినా నిషేధం అమల్లో ఉంటుంది.
చట్టపరమైన ఆధారం..
ఇండియా టుడే నివేదిక ప్రకారం.. కర్ణాటక ప్రభుత్వం 2026, జూన్ 15న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని సెక్షన్ 30 ఉప సెక్షన్(2) లోని క్లాజ్ (ఏ) తో పాటు 2011 నాటి ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలలోని 2.3.4 ప్రకారం కర్ణాటక రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రజారోగ్యం పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యను ప్రవేశపెట్టినట్లు బెంగళూర్ ఆహర భద్రత, ఔషధ పరిపాలన కమిషనర్ తెలిపారు.
Next Story

