
‘‘తెలుగు గంగా ద్వారా అదనపు నీటిని విడుదల చేయండి’’
సీఎం చంద్రబాబును కోరిన తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడిని విజయవాడలో కలుసుకున్నారు. చెన్నై నగరానికి మంచి నీరు అందించే తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా అదనపు నీటిని విడుదల చేయాలని అభ్యర్థించారు.
ఈ అభ్యర్థనపై ఏపీ సీఎం స్పందిస్తూ .. చెన్నై తాగునీటి అవసరాలను తీర్చడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. లభ్యత, అవసరాల ఆధారంగా అదనపు నీటిని విడుదల చేసే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశీలిస్తుందని ఆయన అన్నారు.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల కృష్ణా నదికి నీటి ప్రవాహాం తగ్గి, తీవ్ర నీటి కొరత ఏర్పడినప్పటికీ, చెన్నై తాగునీటి అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఏపీ సీఎం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చెన్నైకి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పరస్పరం ఆసక్తి ఉన్న పలు అంశాలపై కూడా చర్చించారు.
గోదావరి, కావేరీ నదుల అనుసంధానం కరువుకు శాశ్వాత పరిష్కారం చూపిస్తుందని, దాని ప్రాముఖ్యతను ఏపీ సీఎం నొక్కి చెప్పారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడి పున్నమి ఘాట్ లో జరిగిన విజయవాడ ఉత్సవ్ 2.0 అనే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యారు.
తొలిసారి ముఖ్యమంత్రి అయి, విజయవాడకు వచ్చిన విజయ్ కు అక్కడ ఘన స్వాగతం పలికారు. విజయ్ రాజకీయ ఎదుగుదల, తమిళనాడు అభివృద్ధి లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, దేశ యువతపై నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత ప్రధానమంత్రి నాయకత్వాన్ని కూడా ప్రశంసించారు.
అంతేకాకుండా గోదావరి, కృష్ణ, కావేరీ, పెన్నా నదుల అనుసంధానం వల్ల నాలుగు దక్షిణ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
2047 నాటికి భారత్ నంబర్ వన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ ఉత్సవానికి హజరైన విజయ్ కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి అన్నారు. నవరాత్రి ఉత్సవాలకు హజరు కావడం పట్ల విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. అందరికి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో నదుల అనుసంధానంపై చర్చించేందుకు నేను విజయవాడ వచ్చాను. మిమ్మల్ని చూసినందుకు నాకు సంతోషంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
Next Story

