టేస్టీ ‘చోటా సమోసా’ ఎక్కడ దొరుకుతుందంటే
x

టేస్టీ ‘చోటా సమోసా’ ఎక్కడ దొరుకుతుందంటే

హైద‌రాబాద్‌లో ఒక్కో ఏరియాలో ఒక్కో ర‌కం స‌మోసా హాట్ హాట్‌గా నోరూరుస్తోంది.


చిన్న స‌మోసా, ఛోటావాలా స‌మోసా. ఇది హైద‌రాబాద్ ట్రేడ్ మార్క్‌. ఇలాంటి చిన్న స‌మోసా ఇండియాలో మ‌రెక్క‌డా దొర‌క‌దు. హైద‌రాబాద్‌లో గ‌ల్లీ గ‌ల్లీకి చిన్న‌స‌మోలు చేసే బండ్లు, ఇరానీ హోట‌ల్స్ వుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య త‌గ్గింది. అయినా ఈ చిన్ని స‌మోసా రూపాయి నుంచి 10 రూపాయ‌ల‌కు దొరుకుతుంది. హైద‌రాబాద్‌లో ఒక్కో ఏరియాలో ఒక్కో ర‌కం స‌మోసా భోజ‌న ప్రియుల‌కు నోరూరుస్తోంది. ఆ ఏరియానే ఏలుతోంది.

సికింద్రాబాద్‌లో గార్డెన్‌, రైల్వే స్టేష‌న్ వ‌ద్ద అల్ఫా, ఉప్ప‌ల్ బ‌స్టాండ్ వ‌ద్ద బ్లూసీ, చార్మినార్ చౌర‌స్తాలో అస్టోరియా, బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 1లో స‌ర్వీ, ఓల్డ్ సిటీలో మ‌దీనా, చాద‌ర్‌ఘాట్‌లో న‌యాగ‌రా, ఆబిడ్స్‌లో గ్రాండ్ హోట‌ల్. ఇవ‌న్నీ చిన్న స‌మోసాల త‌యారీలో వేటిక‌వే ప్ర‌త్యేకం. ఇలాంటిదే ఎర్ర‌మంజిల్ మెయిన్‌రోడ్ పై ఉన్న రెడ్ రోజ్ కేఫే. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపించే రెడ్ రోజ్ ఆనియ‌న్ స‌మోసా విశేషం ఏమిటో చూద్దామా?

హైద‌రాబాద్ నగరంలో టేస్టీ సమోసా ఎక్కడ దొరుకుతుందంటే అందరికీ గుర్తొచ్చేది రెడ్ రోజ్ కేఫే. వీరు తయారు చేసే సమోసా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్క‌డ ఆనియ‌న్ స‌మోసా తింటే ఫిదా అవాల్సిందే. అందుకే ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చి ప్ర‌త్యేకంగా ఉల్లి స‌మోసా ఆర్డ‌ర్ ఇచ్చి తింటూ ఎంజాయ్ చేస్తారు. ఇరానీ చాయ్ అండ్ స‌మోసా తినాలంటే ఎర్ర‌మంజిల్‌లోని రెడ్ రోజ్ కేఫ్ బెస్ట్ ప్లేస్ అని హైదారాబాదీలు చెబుతుంటారు.

ఏదైనా ఫుడ్ ఐట‌మ్ రుచిగా ఉందంటే అది ఎంత దూరంలో ఉన్నా ఆహార ప్రియులు దాన్ని ఆస్వాదించేందుకు వెనుకాడరు. ఇదే కోవలోకి రెడ్ రోజ్ ఆనియాన్ స‌మోసా వ‌చ్చి చేరింది.. నోరురించే రుచితో, తాజాగా అప్పుడే త‌యారు చేస్తూ అందిస్తున్నారు. దీంతో స‌మోసా కోసం జ‌నం క్యూ క‌డుతున్నారు. గ‌రం గ‌రం నోటి నుంచి పోగ‌లు వ‌స్తుండ‌గా సమోసాను తింటూ ఆస్వాదిస్తున్నారు.

సాధారణంగా సమోసాలను బంగాళా దుంపలు, పిండి మసాలా స్టఫింగ్ తో తయారు చేస్తారు. కానీ, ఈ రెసిపీలో కేవలం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అటుకులు వాడతారు. ఉల్లిపాయల్ని సన్నగా, పొడవుగా తరిగి, అటుకులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి (రుచికి), సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకుతో మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుంటారు.

ఒక్కో రెక్టాంగిల్ షీట్‌ను తీసుకొని, త్రిభుజాకారంలో మడిచి, అంచులను పిండి జిగురుతో అతికిస్తారు. తయారు చేసిన ఉల్లి స్టఫ్ఫింగ్‌ను లోపల నింపి, మూడవ అంచును కూడా పిండి జిగురుతో సీల్ చేస్తారు. సమోసాలను నెమ్మదిగా నూనెలో వేసి, అవి బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యేవరకు వేయిస్తారు. వేడి వేడి ఆనియన్ సమోసాలను టీతో పాటు సర్వ్ చేస్తారు.

Read More
Next Story