‘మా నాన్న తెలుసా, మా అన్న తెలుసా అని మమ్మల్ని అడగొద్దు’
x

‘మా నాన్న తెలుసా, మా అన్న తెలుసా అని మమ్మల్ని అడగొద్దు’

మందు తాగిన తర్వాత క్యాబ్ ఎక్కుతారో లేదంటే కోర్టు మెట్లెక్కుతారో తేల్చుకోండన్న సీపీ సజ్జనార్.


మందుబాబులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మందు తాగిన తర్వాత క్యాబ్ ఎక్కుతారో లేదంటే కోర్టు మెట్లెక్కుతారో తేల్చుకోవాలంటూ హెచ్చరించారు. అంతేకాకుండా కాకుండా గూగుల్‌లో లాయర్‌ను వెతుక్కోవడం కంటే క్యాబ్ వెతుక్కోవడం మంచి పని అని హితవు పలికారు. న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రపంచమంతా రెడీ అవుతోంది. అంతే హైదరాబాద్‌లో కూడా ఈ సన్నాహాలు బాగానే జరుగుతున్నాయి. యువత ఇప్పటి నుంచే న్యూఇయర్ సెలబ్రేషన్ ప్లాన్స్ స్టార్ట్ చేశారు. ఈ సమయంలో హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని పోస్ట్‌లు మందుబాబులకు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎవరైనా వదిలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సీపీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

సోషల్ మీడియా వేదికగా మందుబాబులకు పక్కా హైదరాబాదీ యాసలోనే సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మియా డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు‘‘అని చెప్పారు. అంతేకాకుండా ‘గూగుల్‌లో లాయర్ కోసం వెతకడం కన్నా క్యాబ్ కోసం వెతడం మిన్న’ అని సూచించారు. చలాన్లు, జైలు శిక్షలతో పోలిస్తే క్యాబ్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువని చెప్పారు. అంతేకాకుండా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను బాధ్యతతో జరుపుకోవాలని సూచించారు. అలా కాదు.. మేము ఇంతే అంటే మాత్రం యాక్షన్ గ్యారెంటీ అని తేల్చి చెప్పారు.

‘‘మా డాడీ ఎవరో ఎలుసా? మా అన్న ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దు. మేము మీ ప్రైవసీని గౌరవిస్తాం. వెహికల్ పక్కన పెట్టి.. డేట్ వచ్చినప్పుడు కోర్టుకు వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా చర్యలు ఒకేలా ఉంటాయని చెప్పారు.

Read More
Next Story