మోడల్ గా సంచలనాలు సృష్టిస్తున్న హైదరాబాద్ అమ్మాయి భవితామండవ
x
International Model Bhavitha Mandava

మోడల్ గా సంచలనాలు సృష్టిస్తున్న హైదరాబాద్ అమ్మాయి భవితామండవ

బ్లేజ్ కళ్ళల్లో పడిన మండవ మోడలింగ్ చేయటంతో ఆమెదశ ఒక్కసారిగా మారిపోయింది


జీవితం ఏ నిముషంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అమెరికాకు ఉన్నతచదవు కోసం వెళ్ళిన ఒక అమ్మాయి ఇపుడు అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్(International Model) గా సంచలనాలు సృష్టించటమే తాజా ఉదాహరణ. 25 ఏళ్ళ(Hyderabad) హైదరాబాద్ కు చెందిన భవితామండవ(BhavithaMandava) జెఎన్టీయూ(JNTU)లో ఆర్కిటెక్షర్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివింది. ఇంటరాక్టెడ్ డిజైన్ అండ్ మీడియాలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్ళింది. అక్కడే మండవ భవిత(భవిష్యత్తు)ఒక్కసారిగా మారిపోయింది. ఒకరోజు(New York) న్యూయార్క్ సబ్ వేలో మెట్రో ట్రైన్ కోసం భవిత ఎదురుచూస్తోంది. అదేసమయంలో ప్లాట్ ఫారమ్ మీద ఫ్రెంచ్-బెల్జియమ్ డిజైనర్ మాథ్యూబ్లేజ్ (International Designer Mathew Blaze)కూడా మెట్రోకోసం వెయిట్ చేస్తున్నాడు. తనకు దగ్గరలోనే నిలబడున్న మండవను బ్లేజ్ చూశాడు. మొదటిసారి చూడటంతోనే బ్లేజ్ కు మండవ నచ్చేసింది.

అసలే బ్లేజ్ టాప్ డిజైనర్లలో ఒకడు. అందుకనే తన కెమెరాలాంటి కళ్ళలో మండవపడగానే నేరుగా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. మోడలింగ్ చేస్తావా అని అడిగాడు. మోడలింగులో మండవకు ఎలాంటి అనుభవంలేదు. అయినా వెంటనే ఒప్పేసుకున్నది. ఎందుకు ఒప్పుకున్నది అంటే బ్లేజ్ అడిగిన తీరు ఆమెను బాగా ఆకట్టుకున్నది. అందుకనే మోడలింగ్ చేయటానికి అంగీకరించింది. ఇదంతా 2024లో జరిగింది. బ్లేజ్ కళ్ళల్లో పడిన మండవ మోడలింగ్ చేయటంతో ఆమెదశ ఒక్కసారిగా మారిపోయింది.

బ్లేజ్ కు మోడలింగ్ చేసిన మండవకు రెండువారాల్లోనే ఇలాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘బటేగా వనీటా’ స్ప్రింగ్ సమ్మర్-2025 ఫ్యాషన్ షోలో మోడల్ గా పాల్గొనే అవకాశం దొరికింది. దాదాపు ఆరుడుగుల ఎత్తుండే మండవ సమ్మర్-2025లో ర్యాంప్ వాక్ చేసినపుడు జనాలందరు కళ్ళప్పగించి చూస్తుండిపోయారు. ఆ షోలో మెరుపులాగ మెరిసిన మండవకు తర్వాత తిరుగులేకుండాపోయింది. న్యూయార్క్, ప్యారిస్, లండన్ ఫ్యాషన్ వీక్లీలో ‘డియోర్’ లాంటి ప్రముఖ సంస్ధలకు మోడల్ గా పనిచేసే అవకాశం లభించింది. దాంతో అతి తక్కువకాలంలోనే మండవ అంతర్జాతీయ మోడల్ అయిపోయింది.

తాజాగా న్యూయార్క్ లో ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ సంస్ధ ‘షనెల్’ మేటియే డార్-2026 పేరుతో స్వయంగా మండవే ఒక ఫ్యాషన్ షో నిర్వహించింది. షనెల్ ప్రతిష్టాత్మక షోలో ర్యాంప్ వాక్ చేసిన మొదటి ఇండియన్ మోడల్ గా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా అదే షో ద్వారా ప్రపంచ బ్రాండ్ల కంపెనీలతో మోడలింగుకు ఒప్పందాలు కూడా చేసుకుంది. షనెల్ లాంటి అంతర్జాతీయ కంపెనీ తరపున ర్యాంప్ వాక్ చేయటం, మోడలింగ్ కు ఒప్పందం చేసుకునే అవకాశం చాలా తక్కువమంది మోడల్స్ కు మాత్రమే దక్కుతుంది. భవితకు అతితక్కువ కాలంలోనే అంతర్జాతీయ మోడల్ గా పాపురల్ అవ్వటం పట్ల కుటుంసభ్యులు, ఫ్రెడ్స్ చాలా సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు. ‘షనెల్ ఎంటైర్స్ డీఆర్ట్’ షోను ప్రారంభించటం ద్వారా ఒక్కసారిగా అంతర్జాతీయ సెలబ్రిటీ అయిపోయింది మండవ. న్యూయార్క్ యూనివర్సిటిలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్ళిన మన తెలుగమ్మాయి మండవను కాలం అంతర్జాతీయ సెలబ్రిటీగా మార్చేసింది. న్యూయార్క్ సబ్ వే ప్రయాణమే భవితా మండవ జీవితాన్ని రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మార్చేసింది.

Read More
Next Story