డిసెంబర్ 9న ‘విజయ్ దివాస్’ సంబరాలకు కేటీఆర్ పిలుపు
x
BRS working President KTR

డిసెంబర్ 9న ‘విజయ్ దివాస్’ సంబరాలకు కేటీఆర్ పిలుపు

కేసీఆర్ 11రోజుల ఆమరణదీక్ష విజయవంతం అయిన రోజుగా జనాలందరు డిసెంబర్ 9ని గుర్తుపెట్టుకుంటారని అన్నారు


తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పిలుపిచ్చారు. ఆదివారం పార్టీఆఫీసులో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, క్యాడర్ తో మీటింగ్ జరిగింది. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్(KCR) చేసిన ఆమరణ దీక్షకు తలొంచిన కేంద్రప్రభుత్వం తెలంగా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది డిసెంబర్ 9వ తేదీనే అన్న విషయాన్ని గుర్తుచేశారు. నవంబర్ 29న ‘దీక్షాదివస్’ ను విజయవంతం చేసినట్లే డిసెంబర్ 9వ తేదీన ‘విజయ్ దివాస్’ ను కూడా విజయవంతం చేయాలన్నారు.

కేసీఆర్ 11రోజుల ఆమరణదీక్ష విజయవంతం అయినరోజుగా జనాలందరు డిసెంబర్ 9ని గుర్తుపెట్టుకుంటారని అన్నారు. కాబట్టి ఆరోజును జనాలంతా పండుగలా జరుపుకోవాలని కోరారు. అందరూ స్ధానికసంస్ధల ఎన్నికల బిజీలో ఉన్నకారణంగా గ్రామాల్లోకాకుండా సంబరాలను నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే జరుపుకోవాలన్నారు. నియోజకవర్గకేంద్రాల్లోని తెలంగాణతల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ జరగాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాల దగ్గర లేదా ప్రధాన కూడళ్లల్లో విజయానికి సూచికగా పింక్ బెలూన్లను గాలిలోకి ఎగరేయాలన్నారు.

కార్యక్రమాల తర్వాత మీడియాసమావేశాలు ఏర్పాటుచేసి కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్ధుల త్యాగాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. హైదరాబాదులోని నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. నగర నాయకత్వం ఈ కార్యక్రమంలో పాల్గొంటుందన్నారు. డిసెంబర్ కు 2రోజులే ఉందికాబట్టి జిల్లాలఅధ్యక్షులు చొరవతీసుకుని అన్నీనియోజకవర్గకేంద్రాల్లో కార్యక్రమాలను విజయవంతం చేయటానికి అన్నీ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు.

Read More
Next Story