సిడ్నీలో కాల్పులు జరిపిన సాజిద్ హైదరాబాద్ వ్యక్తే
x
Sajid Akram and Naveed Akram

సిడ్నీలో కాల్పులు జరిపిన సాజిద్ హైదరాబాద్ వ్యక్తే

15 మంది మరణానికి కారకులైన తండ్రి, కొడుకుల్లో తండ్రి(Sajid Akram) సాజిద్ హైదరాబాద్(Hyderabad) వ్యక్తిగా బయటపడటం సంచలనంగా మారింది


ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం పర్యాటకులపై కాల్పులు జరిపి 15 మంది మరణానికి కారకులైన తండ్రి, కొడుకుల్లో తండ్రి(Sajid Akram) సాజిద్ హైదరాబాద్(Hyderabad) వ్యక్తిగా బయటపడటం సంచలనంగా మారింది. ఆదివారం ఈ ఇద్దరు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోగా 45మంది తీవ్రంగా గాయపడిన విషయంతెలిసిందే. యూదులు హనుక్కా(Hanukkah celebrations) వేడుకులు జరుపుకుంటున్న సమయంలో తండ్రి సాజిద్ అక్రమ్, కొడుకు నవీద్ అక్రమ్ ఒక్కసారిగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి వచ్చి జరిపిన ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మరణించగా కొడుకు నవీద్ కు గాయాలయ్యాయి. ఇతడిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు.

సాజిద్ హైదరాబాద్ నేఫథ్యం

మొన్నటివరకు దేశంలో ఎక్కడ ఉగ్రమూలాలు బయటపడినా లేదా ఎక్కడైనా ఉగ్రఘటన జరిగినా వెంటనే దాని మూలాలు హైదరాబాదులో ఉన్నట్లు ఆధారాలు బయటపడేది. అలాంటిది ఇపుడు హైదరాబాద్ వ్యవహారం అంతర్జాతీయస్ధాయికి చేరుకున్నది. చనిపోయిన సాజిద్ మొదట పాకిస్తానీయుడు అనుకున్నారు. అయితే పోలీసులు విచారించినపుడు మృతుడు హైదరాబాద్ వాసిగా బయటపడటం సంచలనంగా మారింది. సాజిద్ 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్ళి అక్కడే స్ధిరపడ్డాడు. తర్వాత అస్ట్రేలియా-ఇటాలియన్ సంతికి చెందిన అమ్మాయిని వివాహంచేసుకున్నాడు. తన విద్యార్థి వీసాను పార్ట్ నర్ వీసాగా మార్చుకున్నారు. వీళ్ళకు నవీద్ అక్కడే జన్మించాడు కాబట్టి కొడుకు జన్మతహ ఆస్ట్రేలియా పౌరుడే. చనిపోయిన సాజిద్ దగ్గర హైదరాబాదులో జారీచేసిన పాస్ పోర్టు ను ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ అధికారులు గుర్తించారు.ఆయన వివరాలను డిజిపి శివధర్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ టోలీ చౌకీలోని ఎల్ హస్నత్ కాలనీలో ఆయన తల్లితండ్రులు ఉంటారు. తండ్రి ఇండియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. సాజిద్ సోదరుడు డాక్టర్." గత ఇరవైఏడు సంవ్సరాలలో సాజిద్ కేవలం ఆరుసార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చాడు. అపుడు కూడా తన భాగం ఆస్తులను విక్రయించేందుకు వచ్చాడు. 2009లో తండ్రి చనిపోయినపుడు కూడా హైదరాబాద్ కు రాలేదు,"అని డిజిపి చెప్పారు. సాజిద్ , ఆయన కుమారుడు నవీద్ ఎలా తీవ్రవాదంతో ప్రేరిపితులయ్యారో తమకు తెలియదని హైదరాబాద్ పోలీసులకు ఆయన కుటుంబీకులు చెప్పారు. సాజిద్ కు సంబంధించి 1998లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లడానికి ముందు హైదరాబాద్ లో ఎలాంటి ఫిర్యాులు గాని, కేసులు గాని లేవని పోలీసులు చెప్పారు. సాజిద్ హైదరాబాద్ లోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో బికామ్ చదివాడు. వివాహం చేసుకున్నాక, 2001లో హైదాబాద్ వచ్చి నిఖా చేసుకున్నాడు. తర్వాత మరొక సారిహైదరాబాద్ వచ్చి షాలిబండలోని తన ఆస్తులను విక్రయించి వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. సాజిద్, అతని కుమారుడు ఆస్ట్రేలియాలోనే తీవ్రవాదంతో ప్రభావితులయిన ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫిలిప్పీన్స్ లో ఐసిస్ శిక్షణ

ఆదివారం దాడికి ముందు తండ్రి, కొడుకులు ఫిలిప్పీన్స్ కు వెళ్ళొచ్చినట్లు పాస్ పోర్టుల్లో స్టాంపింగ్ ఉంది. అక్కడ ఐఎస్ఐఎస్ దగ్గర ఉగ్రశిక్షణ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ వాహనంలో ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోసివ్ డివైస్ లు, హోమ్ మేడ్ ఐఎస్ఐఎస్ జెండాలు దొరికాయి. దాడి జరిగిన విధానం చూసిన తర్వాత ఇది ఐఎస్ఐఎస్ భావజాల ప్రేరేపితమని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం భారత నిఘావర్గాలు హైదరాబాదులోని సాజిద్ కుటుంబసభ్యుల వివరాల కోసం జల్లెడపడతున్నాయి.

Read More
Next Story