తమిళనాడులో మార్పు నిరాశ వైపుకు ప్రయాణిస్తోంది: స్టాలిన్
x
ఎంకే స్టాలిన్

తమిళనాడులో మార్పు నిరాశ వైపుకు ప్రయాణిస్తోంది: స్టాలిన్

యువత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచన


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకేపై ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు అంటూ టీవీకే చేసిన పనులు, తీవ్ర నిరాశగా మిగిలాయని అన్నారు. 2026 ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో టీవీకే పార్టీ తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆ ఎన్నికలలో పార్టీని ఓటు వేసిన ప్రజలను ఉద్దేశించి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితి వెనక ఉన్న రాజకీయా పరిస్థితులు, శక్తులను అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. వచ్చే రోజుల్లో మార్పు కోసం నిర్ణయం తీసుకునే ముందు యువత బాగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
‘‘తమిళనాడులో ఒక మార్పు జరిగింది. కానీ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ. రాజా ముందు చెప్పినట్లుగా ఆ మార్పు నిరాశగా ఉంది. లక్షలాది మంది చేసిన తప్పు ఇప్పుడూ కోట్లాది మందిని ఇబ్బంది పెడుతోంది. ఈ పరిస్థితి మారాలి’’ అని స్టాలిన్ అన్నారు. సామాజిక పురోగతికి దోహదపడిన పరిస్థితులను ఎవరు సృష్టించారో గుర్తించాలని ఆయన యువతరాన్ని అభ్యర్థించారు.
ప్రముఖ సినీ నిర్మాత, తన బంధువు అయిన అమృతం మనవరాలు డాక్టర్ ఇలక్కియా, డాక్టర్ గిరిధరల వివాహానికి హాజరైన సందర్భంగా స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్టాలిన్ ఇంకా ఏమన్నారంటే..

కుటుంబ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం తనకు ఇష్టం లేదని పేర్కొంటూనే గత సంక్షేమ విధానాలు, సామాజిక న్యాయ ఉద్యమాల కారణంగా తమ కుటుంబంలో తరతరాలుగా వైద్యులు ఉన్నారని, ఈ వారసత్వాన్ని నేటీ యువత తరుచుగా విస్మరిస్తోందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
తన పెంపకాన్ని గుర్తు చేసుకుంటూ దివంగత డీఎంకే అధినేత ఎం. కరుణానిధి సోదరీ కుమారుడైన అమృతం, మాజీ కేంద్ర మంత్రి మురసోలీ మారన్, మురసోలీ సెల్వంల గురించి స్టాలిన్ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. కరుణానిధి పిల్లల విద్య, వృత్తిని తీర్చిదిద్దడంలో ఈ ముగ్గురు బంధువులు కీలకపాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.
‘‘మురసోలీ మారన్ ప్రశాంతంగా, మరసోలీ సెల్వం సౌమ్యంగా ఉండగా, అమృతం చాలా కఠినంగా ఉండేవారు. మిమ్మల్ని పెంచుతున్నప్పుడూ క్రమ శిక్షణ నేర్పడానికి నా చెంపపై కూడా కొట్టేవారు’’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు, ఉప ప్రధాన కార్యదర్శి ఏ రాజా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ ఎస్ భారతీ, కవి వైరముత్తు, డీఎంకే యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు.
Read More
Next Story