ఉదయనిధి వ్యాఖ్యలు జాతిహత్యలకు దారితీసే ప్రమాదం: హైకోర్టు
x
ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి వ్యాఖ్యలు జాతిహత్యలకు దారితీసే ప్రమాదం: హైకోర్టు

అమిత్ మాలవీయపై కేసు కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు


తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ట్వీట్లు చేసిన బీజేపీ నేతపై డీఎంకే ప్రభుత్వం పెట్టిన కేసులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.

అయితే ఉపముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అటువంటి వ్యాఖ్యలను జాతి హత్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.

జస్టిస్ శ్రీమతి అమిత్ మాలవీయ ‘‘మంత్రి చేసిన ప్రసంగానికి మాత్రమే స్పందించారు. అలాంటి చర్యకు ఎలాంటి ప్రతిచర్య తీసుకోవడం చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమే కాకుండా అతనికి కోలుకోలేని విధంగా దెబ్బను కలిగిస్తుంది’’ అని తన తుది తీర్పులో పేర్కొన్నారు.
ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే..
తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 2023 లో ‘‘సనాతన నిర్మూలన సమావేశం’’ నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియతో పోల్చారు.
సనాతన ధర్మాన్ని దేశం నుంచి నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మంత్రిపై మద్రాస్, హైకోర్టులో, సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి.
అమిత్ మాలవీయ కేసు..
ఉదయనిధి వీడియోను మాలవీయ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి వక్రీకరించారని, దేశంలో 80 శాతం సనాతన ధర్మం అచరిస్తున్న ప్రజలను మారణహోమం చేయాలని మంత్రి పిలుపునిచ్చారని బీజేపీకి చెందిన అమిత్ మాలవీయపై కేసు నమోదైంది.
మాలవీయ సోషల్ మీడియా పోస్ట్ తరువాత అయోధ్యకు చెందిన ఒక సాధువు మంత్రి తల నరికితే రూ. 10 కోట్ల రికార్డును ప్రకటించినందున ఆయన పోస్ట్ ద్వేషపూరిత ప్రసంగం కిందకు వస్తుందని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
కోర్టు తీర్పు..
మంత్రికి లేదా పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభిచమని మాల్వియా ఎవరినీ అడగలేదని, వాస్తవాలు, ప్రశ్నలు మాత్రమే ముందుకు తెచ్చారని కోర్టు తీర్పు చెప్పింది. మాలవీయ మంత్రి నుంచి సమాధానాలు మాత్రమే కోరారని, అది అతనిపై మోపబడిన నిబంధనల పరిధిలోకి కూడా రాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
సనాతన ధర్మం గురించి మంత్రి పదే పదే అనేక విషయాలు చెప్పారని, ప్రస్తుత కేసుకు దారితీసిన మొత్తం పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
ఉదయనిధి ప్రసంగం 80 శాతం హిందువులకు వ్యతిరేకంగా ఉందని, అది ద్వేషపూరిత ప్రసంగం పరిధిలోకి వస్తుందని ఆయన ప్రసంగం జాతి విధ్వంసాన్ని కూడా సూచించవచ్చని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
‘‘రద్దు’’ అనేపదం ఉనికిలో ఉన్న ఏదో ఒకటి ఉండకూడదని సూచిస్తుందని, ప్రస్తుత సందర్భంలో సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు అక్కడ ఉండకూడదని కోర్టు పేర్కొంది. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల సమూహం అక్కడ ఉండకూడదంటే తగిన పదం ‘‘జాతి నిర్మూలన’’ అని కూడా కోర్టు పేర్కొంది.
Read More
Next Story