వందేమాతరంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెబుతూనే ఉంది. జనగణమనకు ఇచ్చిన విలువను వందేమాతరానికి ఇవ్వమనే దాని వైఖరిని మరోసారి ఉద్ఘాటించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే. మురళీధరన్, కాంగ్రెస్ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ ఆదివారం మాట్లాడుతూ.. కేరళలో వందేమాతరం పూర్తిగా పాడబోమని ప్రకటించారు.
జాతీయ గేయంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపిస్తామని మురళీధరన్ విలేకరులతో అన్నారు. గతంలో ఆలపించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపిస్తామని పేర్కొన్నారు.
ఈ జన్మలో కేరళలో వందేమాతరం పూర్తి గీతాలాపన జరగదని ఉన్నితాన్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ.. జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపించాలని ప్రధాన కార్యదర్శి నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయో తనకు తెలియదని, అని నరేంద్ర మోదీ మమ్మల్ని కాల్చివేస్తామని బెదిరించిన సరే దానిని పూర్తిగా పాడమని అన్నారు. వందేమాతరంలోని ఇతర చరణాలను పాడబోమని పేర్కొన్నారు.
కేరళ మంత్రి అసంతృప్తి..
కేంద్ర హోంశాఖ అమిత్ షా అధ్యక్షతన ఉన్న జాతీయ అమలు కమిటీ ఆమోదించిన ప్రకారం.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద 2002 ప్రారంభించిన ఈ ప్రచార కార్యక్రమం కింద 2026 ఎడిషన్ ను దేశవ్యాప్తంగా జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాల మూడో దశతో విలీనం చేసినట్లు కేరళ ప్రధాన కార్యదర్శి బిశ్వనాథ్ సిన్హా ఆగష్టు 6న రాసిన లేఖకు వారిద్దరూ స్పందించారు.
కొత్త చట్టం ప్రకారం అన్ని కార్యక్రమాలలో వందేమాతరం ఆలపించడంతో పాటు జాతీయ జెండాను ఎగురవేయడం జరుగుతుంది. ఇందులో హర్ ఘర్ తిరంగా పోర్టల్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ పౌరులు తమ త్రివర్ణ పతాకంతో సెల్పీని అప్ లోడ్ చేసుకోవచ్చని ఈ లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు సంబంధించి ప్రధాన కార్యదర్శి కొన్నిసార్లు సర్క్యూలర్లు జారీ చేస్తారని, అలా చేయడం ఆయన విధి అని మురళీధరన్ అన్నారు. కానీ కేరళ దానికి అంగీకరించదని చెప్పారు.
కేరళ కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ లేదు..
గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగినందున ఆ సందర్భంగా జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించారని మంత్రి ఇంకా తెలిపారు. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలలో అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ నియమావళి పాటిస్తారని ఆయన అన్నారు.
‘‘అయితే కేరళ ప్రభుత్వ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నియామవళిని పాటించరు’’. దానికి బదులుగా మా నిబంధనలే పాటిస్తామని చెప్పారు. ఉన్నిథాన్ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ భవన్ లు నీచ స్థాయి రాజకీయాలకు కేంద్రంగా మారాయని, గవర్నర్లు ఇప్పుడు డబ్బు బలంతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించాలని ఆదేశిస్తూ జారీ చేసిన లేఖను ప్రతిపక్ష సీపీఐ కూడా విమర్శించింది. దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాకు లొంగిపోతోందని కూడా అది ఆరోపించింది.