
భారత సైద్దాంతిక రాజకీయాల భవిష్యత్ ఏంటీ?
దేశంలో వంద సంవత్సరాలుగా తమ ఉనికి చాటుకుంటున్న వామపక్షం, హిందూ జాతీయవాదం, మధ్యేవాద కాంగ్రెస్
దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 వసంతాలు పూర్తి అయి, 77 వ ఏటా అడుగు పెట్టడానికి సిద్దంగా ఉంది. ఈ అసాధారణ చారిత్రక ప్రయాణంలో దేశ రాజకీయాలను శాసించిన మూడు సైద్దాంతిక సిద్ధాంతాలు అయిన కమ్యూనిస్ట్ ల వామపక్షం, హిందూ జాతీయవాద మితవాదం, మధ్యేవాద రాజకీయాలకు కేంద్రంగా ఉన్న కాంగ్రెస్ లు దాదాపు వంద సంవత్సరాలుగా తమ ఉనికి ఘనంగా చాటుకున్నాయి.
ఈ పోటీ శక్తులు మన గణతంత్య్ర దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాయి. వాటిలో కొన్ని శక్తులు ఎందుకు క్రమంగా క్షీణదశలో ఉన్నాయి, మరికొన్ని శక్తుల బలం రోజురోజుకు ఎందుకు పెరుగుతుందో ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ ప్రత్యేకంగా విశ్లేషించారు.
‘టాకింగ్ విత్ శ్రీని’ కార్యక్రమం 50వ ఎపిసోడ్ కార్యక్రమం సందర్భంగా మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించి, రికార్డు చేశారు. స్వాతంత్య్రం తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైట్ వింగ్ రాజకీయాలు బలంగా ఎదుగుతున్న నేపథ్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భారత్ ఎందుకు మధ్యవాదం వైపు మొగ్గింది..
స్వాతంత్య్రనంతరం భారత్ మధ్యేవాద మార్గాన్ని ఎంచుకుంది. అయితే ఈ ఛాయిస్ ప్రమాదవశాత్తూ లేదా అనివార్యమైన అంశం కాదని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఇది మహాత్మా గాంధీ ప్రభావం, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజా మద్దతును కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన వ్యూహ ఫలితమని చెప్పారు.
‘‘1947కి ముందు వామపక్షాలు, రైట్ వింగ్ రెండు చురుకుగా ఉండేవి. కానీ వారి రాజకీయాలను మించి తన ప్రభావాన్ని చూపింది గాంధీయే’’ అని శ్రీనివాసన్ వివరించారు.
కమ్యూనిస్ట్ లు ఎక్కువగా భూ సంస్కరణలు, వర్గ పోరాటాలు, రైతు కూలీల సమీకరణపై దృష్టి పెట్టగా, జాతీయవాదులు దేశ సంస్కృతి, నాగరికతపై తమ ఫోకస్ ప్రసరించే పని చేశారు. కానీ మహ్మాత్మా గాంధీ నాయకత్వం కింద కాంగ్రెస్ పార్టీ మధ్యస్థ రాజకీయాలకు తెరతీసింది.
గాంధీజీ అమలు చేసిన రాజకీయాలు సిద్ధాంతపరమైనవి కావని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఆయన లౌకికవాదం అనే ఆలోచన, రాజ్యాన్ని పాశ్చాత్య దేశాల నుంచి వేరుచేయకుండా, దేశపు సామాజిక సంక్లిష్టతను సరళతరం చేస్తూ ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన సమగ్ర చట్రంగా పేర్కొన్నారు.
‘‘భారత్ చాలా వైవిధ్యభరితమైన క్లిష్టమైన దేశం. మతం, ప్రాంతం, కులం, భాష’’ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. ‘‘గాంధీ వీటిని అర్థం చేసుకుని మరింత గట్టి బంధన శక్తిగా మార్చారు’’
అయితే ఆశ్చర్యకరంగా స్వాతంత్య్రం తరువాత ఇదే విధానం ఎన్నికల అంశంగా మారింది. మొదటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో ఆర్థిక ప్రణాళిక, సామాజిక సంస్కరణలను కలిపి ఈ మధ్యేవాద మార్గాన్ని ముందుకు తీసుకెళ్లాడు.
వామపక్షాల ఉన్నతి.. పతనం..
దేశంలో కాంగ్రెస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ శక్తిగా వామపక్షాలకు పేరు ఉండేది. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అవి సవాల్ చేశాయి. 1952 ఎన్నికల్లో అవి కాంగ్రెస్ తరువాత రెండో అతిపెద్ద పక్షంగా నిలిచాయి. భూసంస్కరణలు, వర్గపోరాటాలతో అవి క్షేత్ర స్థాయిలో బలంగా తమ ఉనికిని చాటుకున్నాయి.
కాలక్రమంలో అవి దేశంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం లో విఫలం అయ్యాయని, క్రమంగా క్షీణదశకు చేరుకున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వారి విధానం కేవలం సిద్ధాంతపరమైనది’’ అని చెప్పారు. ‘‘మార్కిస్ట్ సిద్దాంతాలకు మొండిగా అమలు చేసే ప్రయత్నం చేశారు. దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోలేకపోయారు’’.
దేశంలో కుల రాజకీయాలకు ప్రాధాన్యం ఉంది. కానీ కమ్యూనిస్టులు కులాలతో సంబంధాలు పెట్టుకోవడంలో విముఖత చూపారు. దేశంలో కులం ఒక రాజకీయ వాస్తవమని శ్రీనివాసన్ ఎత్తిచూపారు. ఎన్నికలలో ఇలాంటి వాటిని దూరం చేసుకోకూడదని చెప్పారు.
అలాగే నిర్ణయాలు కేవలం పోలిట్ బ్యూరోలోనే కేంద్రీకృతం కావడం కూడా దాని పతనానికి దారితీసిన మరో ముఖ్యమైన పరిణామం. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో సుదీర్ఘకాలం పాటు పరిపాలన చేసినప్పటికీ అక్కడ రాజకీయ స్తబ్దత ఏర్పడిందని చెప్పారు.
ఇలాంటి కేంద్రీకృత విధానాలు కిందిస్థాయి హింసను నిరోధించడం, నాయత్వాన్ని తయారు చేసుకోవడంలో వైఫల్యానికి గురి అయ్యాయి. వారు చీలికలుగా విడిపోవడం కూడా వైఫల్యానికి మరో కారణం. వంద సంవత్సరాల సందర్భంగా కూడా వారు కలిసిపోలేదు. వామపక్షాల వైఫల్యంతోనే రైట్ వింగ్ రాజకీయాలు బలపడ్డాయనే వాదనను ఆయన అంగీకరించలేదు.
రైట్ వింగ్ రాజకీయాలకు..
ఆర్ఎస్ఎస్ కు రాజకీయ భాగస్వామిగా ఉన్న రాజకీయ పార్టీ అధికారం దక్కించుకోవడానికి వేరే మార్గాన్ని ఎంచుకుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆర్ఎస్ఎస్ ఎక్కువగా వ్యక్తి నిర్మాణం, సమాజంపైనే దృష్టి పెట్టింది. గాంధీ హత్య తరువాత ఆ సంస్థపై నిషేధం విధించడంతో దాని రాజకీయ విభాగం వెనక్కి జరిగింది.
రైట్ వింగ్ రాజకీయాలు తిరిగి 1970ల చివర, 1980ల ప్రారంభంలో జరిగింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు, తమిళనాడులోని మీనాక్షిపురంలో సామూహిక మతమార్పిడులు, జమ్మూకశ్మీర్ లో రాజకీయ పరిస్థితులు, షాబానో కేసు వంటివి మెజారిటీ ప్రజల ఆందోళనలకు పట్టించుకోవడం లేదని భావన హిందూ సమూహంలో ఎక్కువ అలజడిని సృష్టించాయి.
1990 ప్రారంభంలో ప్రారంభమైన రామజన్మభూమి ఉద్యమం దీనికి ఓ ఆధారాన్ని ఇచ్చింది. కానీ ఇది ఈ ఒక్క సంఘటనతో ప్రారంభం కాలేదని శ్రీనివాసన్ చెప్పారు. ‘‘కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, వామపక్షాల రాజకీయ శూన్యత కారణం’’ అని పేర్కొన్నారు.
2014 లో మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఆ పార్టీ కేవలం పాలన మార్పుగా అభివర్ణించింది. జాతీయవాదం, సాంస్కృతిక గుర్తింపు, బలమైన నాయకత్వం దాని పాలన లక్షణాలుగా మారిపోయాయి.
రైట్ వింగ్ రాజకీయం ఎదుగుదల అనేది దాని క్షేత్ర స్థాయి బలాన్ని తెలియజేస్తోందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ క్షీణతను కూడా తెలియజేస్తోందన్నారు. ఒకప్పుడు అట్టడుగు వర్గాల్లో దానికి ఆదరణ ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ కేవలం కార్యకర్తల పార్టీగా కాకుండా, నాయకుల పార్టీగా మారిందని వివరించారు.
యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు, వంశపారంపర్య రాజకీయాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేకపోవడంతో దాని విశ్వసనీయత అడుగంటిపోయిందని అన్నారు.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో మధ్యేవాదం ఇంకా బలంగా ఉందని శ్రీనివాసన్ వాదించారు. బీజేపీ ఆధిపత్యంలో కూడా 40-45 శాతం ఓటర్లు దానికి సమర్థిస్తున్నారని చెప్పారు.
భవిష్యత్ ఏంటీ?
భవిష్యత్ లో సిద్దాంత సరిహద్దులు అస్పష్టంగా ఉండబోతున్నాయని అంచనావేశారు. ప్రపంచీకరణ ప్రభుత్వాలు, మితవాద ప్రభుత్వాలు, ఒకప్పుడు సోషలిజంతో ఉన్న సంక్షేమ విధానాలను అవలంభించేవి. అదే సమయంలో ఆప్ వంటివి వీటి వర్గీకరణను క్లిష్టతరం చేశాయి.
ప్రస్తుతం దేశంలో సంస్థాగత క్రమశిక్షణ, ప్రతిపక్షం బలంగా లేకపోవడంతో రైట్ వింగ్ రాజకీయాలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. భారత్ లో సైద్దాంతిక రాజకీయాలకు శతాబ్దానికి చేరుకున్న తరుణంలో రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య చర్చను పూర్తిగా పక్కదారి పట్టించకుండా ఆ సంప్రదాయాలు వేగంగా మారుతున్న సమాజానికి అనుగుణంగా అందించగలరా అనేది ఇక్కడ కీలక సవాల్ అని శ్రీనివాసన్ తన విశ్లేషణను ముగించారు.
Next Story


